పీసీసీ చీఫ్ పదవికి రాజీనామాపై తేల్చేసిన డీకే శివకుమార్

Published : May 16, 2023, 05:32 PM IST
పీసీసీ చీఫ్  పదవికి రాజీనామాపై తేల్చేసిన  డీకే  శివకుమార్

సారాంశం

పీసీసీ చీఫ్ పదవికి  తాను  రాజీనామా చేయలేదని  కర్ణాటక  పీసీసీ చీఫ్  డీకే  శివకుమార్ ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ తనకు  తల్లిలాంటిదన్నారు. 

న్యూఢిల్లీ: పీసీసీ చీఫ్ పదవికి తాను  రాజీనామా  చేస్తానని వచ్చిన వార్తలను   కర్ణాటక  పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ ఖండించారు.

మంగళవారంనాడు  న్యూఢిల్లీలో   కర్ణాటక  పీసీసీ చీఫ్   డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు  తల్లిలాంటిదన్నారు.   కర్ణాటకలో  కాంగ్రెస్ ను తానే నిర్మించానన్నారు. 
 తాను  రాజీనామా  చేసినట్టుగా, చేస్తానని  వస్తున్న వార్తలు  అవాస్తవమన్నారు.  పీసీసీ  అధ్యక్ష పదవికి తాను  రాజీనామా చేయలేదని ఆయన  స్పష్టం  చేశారు.  మరో వైపు  పీసీసీ చీఫ్ పదవికి కూడా రాజీనామా  చేస్తారని కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం  చేస్తున్నాయని  ఆయన  చెప్పారు.  ఈ తరహ ప్రచారం చేసే  మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని  డీకే  శివకుమార్ చెప్పారు. 

కర్ణాటక  సీఎం పదవి కోసం   కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం  కసరత్తు  చేస్తుంది.  పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు  డీకే  శివకుమార్  ఇవాళ  న్యూఢీల్లికి  చేరుకున్నారు.  ఇవాళ  సాయంత్రం  ఎఐసీసీ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేతో  డీకే శివకుమార్ భేటీ కానున్నారు. తాను  రాజీనామా  చేస్తున్నట్టుగా  ఎలాంటి ఆధారం లేకుండా  ప్రచారం  చేయడం సరైంది కాదన్నారు. తప్పుడు  ప్రచారం చేయవద్దని  ఆయన మీడియాను  కోరారు. 

also read:ఖర్గేతో రాహుల్ భేటీ,ఢీల్లీకి చేరిన డీకే శివకుమార్: కర్ణాటక సీఎం అభ్యర్ధిపై కాంగ్రెస్ కసరత్తు

ఆదివారంనాడు  జరిగిన  సీఎల్పీ సమావేశంలో  ఎమ్మెల్యేల అభిప్రాయాలను  కాంగ్రెస్ పార్టీ  పరిశీలకుల బృందం స్వీకరించింది.  పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను  సిద్దరామయ్య,  డీకే  శివకమార్ కు  మల్లికార్జున ఖర్గే వివరించనున్నారు. 

ఇవాళ  ఉదయం  మల్లికార్జున ఖర్గేతో  రాహుల్ గాంధీ , కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు.  కర్ణాటక  సీఎం  పదవికిఎవరిని ఎంపిక  చేయాలనే దానిపై  నేతలు  చర్చించారు. 

నిన్న  మధ్యాహ్నమే  మాజీ సీఎం సిద్దరామయ్య  ఢిల్లీకి  చేరుకున్నారు.  పలువురు పార్టీ నేతలతో  సిద్దరామయ్య  చర్చించారు.  అనారోగ్య  కారణాలతో  డీకే శివకుమార్  నిన్న  న్యూఢిల్లీకి  రాలేదుఇవాళ  ఉదయం  ఢిల్లీకి ఆయన  బయలుదేరి వచ్చారు. 

న్య్యూఢిల్లీకి వచ్చిన తర్వాత  తన సోదరుడు డీకే  సురేష్  నివాసానికి  ఆయన  చేరుకున్నారు. డీకే  సురేష్ నివాసం నుండి  సాయంత్రం నేరుగా  ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున  ఖర్గేతో భేటీకి  డీకే  శివకుమార్ బయలుదేరారు.  నిన్న రాత్రి  డీకే  సురేష్  మల్లికార్జున ఖర్గేతో  భేటీ అయ్యారు. 

 

PREV
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!