నా మౌనాన్ని బలహీనతగా చూడొద్దు: ఉద్ధవ్ ఠాక్రే

By narsimha lodeFirst Published Sep 13, 2020, 2:06 PM IST
Highlights

రాష్ట్రంలో రాజకీయ తుఫానులు ఏమైనా వచ్చినా తాను ఎదుర్కొంటానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

ముంబై: రాష్ట్రంలో రాజకీయ తుఫానులు ఏమైనా వచ్చినా తాను ఎదుర్కొంటానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

ఆదివారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ముంబైని అపఖ్యాతి చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తన మౌనాన్ని బలహీనతగా భావించొద్దని ఆయన తేల్చి చెప్పారు.

ప్రస్తుతం తన దృష్టి కరోనాపైనే ఉంది, రాజకీయాలపై మాట్లాడనని ఉద్ధవ్ చెప్పారు.రాష్ట్రంలో వైరస్ తగ్గుముఖం పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బాలీవుడ్ సినీ నటి కంగనా ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. కంగనా కార్యాలయాన్ని ఇటీవలనే మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగనా రనౌత్ కు మధ్య మాటల యుద్ధం సాగింది. శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ,కంగనా మధ్య సాగిన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది.కంగనా కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కేటాయించిన విషయం తెలిసిందే.

కంగనా రనౌత్ ఇటీవల ముంబైకి చేరుకొన్న సమయంలో శివసేన కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె కూడ శివసేనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవాళ గవర్నర్ తో ఆమె భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

click me!