ఇండియాలో కరోనా జోరు: మొత్తం కేసులు 47,54,357కి చేరిక

By narsimha lode  |  First Published Sep 13, 2020, 10:55 AM IST

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గత 24 గంటల్లో 94,372 వేల  కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసులు 47 లక్షల 54 వేల 357కి చేరుకొన్నాయి. 


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గత 24 గంటల్లో 94,372 వేల  కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసులు 47 లక్షల 54 వేల 357కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 1,114 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 58,586కి చేరుకొన్నాయి.దేశంలో 9,73,175 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకి రికవరీ అయిన వారిలో 37 లక్షల 02  వేల 596 మంది ఉన్నట్టుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

Latest Videos

undefined

కరోనా నుండి మే మాసంలో 50 వేల మంది రోగులు కోలుకొంటే సెప్టెంబర్ మాసానికి 36 లక్షలకు చేరుకొంది. కరోనా బాధితుల రికవరీ రేటు 77.88 శాతంగా ఉంది. కరోనాతో మరణించిన రోగుల శాతం 1.65 శాతంగా ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. 

కరోనాతో చనిపోతున్నవారిలో ఎక్కువగా ఇతర రోగాలతో ఉన్నవారే ఎక్కువని కేంద్రం తెలిపింది.శనివారం నాడు దేశ వ్యాప్తంగా 10,71,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 5 కోట్ల 62 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. 

click me!