ఈషా అంబానీ పెళ్లికి ట్రంప్ దంపతులు..?

sivanagaprasad kodati |  
Published : Dec 09, 2018, 10:59 AM IST
ఈషా అంబానీ పెళ్లికి ట్రంప్ దంపతులు..?

సారాంశం

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గారాలపట్టి ఈషా అంబానీ పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న ముంబైలో ఈషా, ఆనంద్ పిరమల్ వివాహం జరగునుంది. 

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గారాలపట్టి ఈషా అంబానీ పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12న ముంబైలో ఈషా, ఆనంద్ పిరమల్ వివాహం జరగునుంది.

ఇందుకు సంబంధించి ఈ నెల 7 నుంచి ఉదయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. అంబానీల పెళ్లి వేడులకంటే మాటలా.. పేరు పొందిన సెలబ్రిటీలు కూడా అక్కడ సామాన్య జనమవుతారు. అంతర్జాతీయంగా పేరొందిన సెలబ్రిటీలు, పవర్‌ఫుల్ లీడర్స్  ఎందరో దానికి అతిథులుగా వస్తారు కాబట్టి.

ఇప్పటికే దేశ, విదేశీ ప్రముఖులు ఎందరో ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన హిల్లరీ క్లింటన్.. ఈషా అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు మూడు రోజుల ముందుగా చేరుకున్నారంటే అంబానీల స్టామినా ఏంటో తెలుసుకోవచ్చు.

భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రతిబింబించేలా ఆమె చుడీదార్‌లో కనిపించారు. ఇక ఈషా అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించి ముంబైలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 12 జరిగే వివాహానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రానున్నారంటూ ఓ వార్త వినిపిస్తోంది. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఈషా అంబానీ పెళ్లికి వస్తారని ఆ వార్త సారాంశం.

ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వచ్చే బుధవారం దాకా ఆగాల్సిందే. మరోవైపు అంతర్జాతీయ వ్యాపారవేత్తలు లక్ష్మీనివాస్ మిట్టల్, ఉషా మిట్టల్, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ శిక్కా, రాజీవ్ నూరి, అరియానా, ఫరీద్ జకారియాతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా, అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, విద్యాబాలన్ తదితరులు హాజరయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu