మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

Published : Dec 09, 2018, 08:39 AM ISTUpdated : Dec 09, 2018, 08:41 AM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. మహరాష్ట్రలోని చంద్రపూర్ లో శనివారం రాత్రి వ్యాన్ ను ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది మరణించారు.

నాగపూర్: మహారాష్ట్రలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. మహరాష్ట్రలోని చంద్రపూర్ లో శనివారం రాత్రి వ్యాన్ ను ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది మరణించారు.

మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 14 మంది ఉన్నారు. వారు కోర్పానా - వాని రోడ్డుపై ప్రయాణిస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదంలో 10 మంది మరణించినట్లు తెలిసిందని చంద్రాపూర్ పోలీసు సూపరింటిండెంట్ మహేశ్వర రెడ్డి చెప్పారు. 

సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి కథనం ప్రకారం - ఏడుగురు మహిళలు, వ్యాన్ డ్రైవర్, మూడేళ్ల చిన్నారి, మరో మైనర్ మరణించారు.

ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఏడాది చిన్నారి గాయాలు కూడా కాకుండా బయటపడింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !