ముంబయిని త్వరలోనే పేల్చేస్తా: సోషల్ మీడియాలో బెదిరింపు.. నిందితుడు అరెస్టు

Published : May 23, 2023, 12:54 PM IST
ముంబయిని త్వరలోనే పేల్చేస్తా: సోషల్ మీడియాలో బెదిరింపు.. నిందితుడు అరెస్టు

సారాంశం

ముంబయి నగరాన్ని పేల్చేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోలీసులు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆ ఖాతాను పరీక్షించి నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

ముంబయి: త్వరలో ముంబయి మహానగరాన్ని పేల్చేస్తానని ఓ దుండగుడు సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ మెస్సేజీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ బెదిరింపులు వచ్చాయి. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. నిందితుడిని గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ బెదిరింపుల మెస్సేజీ గురించి పోలీసులకు తెలియవచ్చింది. ఆ మెస్సేజీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నేను త్వరలో ముంబయిని పేల్చేస్తాను అని ఆ మెస్సేజీ ఉన్నది.

ఈ మెస్సేజీ గురించి తెలియగానే పోలీసులు ఆ పోస్టు చేసిన ఖాతాపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వారు ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: రాత్రి వేళ ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణం.. వైరల్ అవుతున్న వీడియోలు..

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీకి హత్య బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గోరఖ్‌పూర్ నివాసి మనోజ్ రాయ్ గా గుర్తించారు.లక్నోలోని గోమతినగర్‌లో నివాసముంటున్న లల్లన్‌కుమార్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. లల్లన్ కాంగ్రెస్ కమిటీకి మీడియా కోఆర్డినేటర్. అతని ఫిర్యాదు మేరకు లక్నోలోని చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో మనోజ్ కుమార్ పై కేసు నమోదైంది. లక్నోలో ఈ కేసు నమోదైన వెంటనే లక్నో, గోరఖ్‌పూర్ పోలీసులు మనోజ్ రాయ్ కోసం వెతకడం ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !