
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఓ కంటైనర్ ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 10 మందికి గాయాలు అయ్యాయి. రాష్ట్ర రాజధాని ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని పాత ముంబై-నాగ్ పూర్ హైవేపై సింద్ ఖేడ్ రాజా పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వారెవ్వా.. నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లి.. ఇంట్లోనే బావి తవ్విన 14 ఏళ్ల బాలుడు
మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు పూణే నుంచి మెహ్కర్ (బుల్ధానా) వైపు వెళ్తుండగా ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి అక్కడే మరణించారు. మృతుల్లో నలుగురు బస్సులో ప్రయాణిస్తున్న వారు కాగా.. మిగిలిన ఇద్దరు రెండు వాహనాల బస్సు డ్రైవర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని సింద్ ఖేడ్ రాజాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఇదే రాష్ట్రంలోని అమరావతి జిల్లాలో ఓ ట్రక్కు వేగంగా ఎస్‌యూవీని ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. రాష్ట్ర రాజధాని ముంబైకి దాదాపు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలోని ఖల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్యాపూర్-అంజంగావ్ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు ఆర్థిక సాయం చేస్తానని టీచర్ పై అత్యాచారం.. అసహజ శృంగారం..
బాధితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. వీరంతా ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొని దర్యాపూర్‌కు తిరిగి వస్తున్నారు.ర క్షతగాత్రులను దర్యాపూర్‌లోని ఆసుపత్రికి తరలించామని, అక్కడ వారంతా చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.