ముంబైలో కార్చిచ్చు... ప్రమాదంలో అరుదైన జీవులు

sivanagaprasad kodati |  
Published : Dec 04, 2018, 10:36 AM IST
ముంబైలో కార్చిచ్చు... ప్రమాదంలో అరుదైన జీవులు

సారాంశం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కార్చిచ్చు రాజుకుంది. ఉత్తర ముంబయిలోని గోరేగావ్‌కు సమీపంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని అటవీ ప్రాంతంలో మంటలు రేగాయి. 

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కార్చిచ్చు రాజుకుంది. ఉత్తర ముంబయిలోని గోరేగావ్‌కు సమీపంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని అటవీ ప్రాంతంలో మంటలు రేగాయి. పార్క్‌కు అనుకుని ఉన్న ఆరే-కాలనీకి సమీపాన గల ఐటీపార్క్‌కు దగ్గరల్లో ఉన్న దట్టమైన అడవి వుంది.

ఫిల్మ్‌సిటికి సమీపంలో ఉన్న హబల్‌పడ పర్వతాలపై ముందుగా కార్చిచ్చును గమనించారు. సోమవారం సాయంత్రానికి సుమారు 4 కి.మీ విస్తీర్ణంలో అటవీప్రాంతం దగ్థమైంది. ఈ జాతీయ ఉద్యానవనంలో అరుదైన జంతు జాలంతో పాటు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి పందులు ఎక్కువగా జీవిస్తున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు.. వందల కొద్ది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?