పీవోకే పాకిస్తాన్‌దే: ఫరూఖ్ అబ్దుల్లా

sivanagaprasad kodati |  
Published : Dec 03, 2018, 02:17 PM IST
పీవోకే పాకిస్తాన్‌దే: ఫరూఖ్ అబ్దుల్లా

సారాంశం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాక్‌లో అంతర్భాగమన్నారు కేంద్ర మాజీ మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్ధుల్లా. ఆదివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... పీవోకే పాక్‌కే సొంతమని.. అదే విధంగా జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగమని ఫరూఖ్ స్పష్టం చేశారు. 

తమ పార్టీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి కేంద్ర ప్రభుత్వం కాదని.. కశ్మీర్ ప్రజలని అబ్దుల్లా వెల్లడించారు. కర్తార్‌పూర్ కారిడార్ పనుల నేపథ్యంలో పీవోకేలోని శారదాపీఠం ఆలయాన్ని కశ్మీరీ పండిట్ల కోసం తెరువాలన్న డిమాండ్‌కు ఫరూఖ్ మద్దతు పలికారు.

రెండు దేశాల మధ్య స్నేహా సంబంధాలు కశ్మీర్‌కు ఎంతో ముఖ్యమని.. సత్సంబంధాలు ప్రారంభమైతే ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని అబ్ధుల్లా తెలిపారు. తమ రాష్ట్రంలో బీజేపీ రాజకీయాల కారణంగానే తాము ఇష్టం లేకపోయినా పీడీపీతో కలవడానికి సిద్ధమయ్యామని ఫరూఖ్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?