మరోసారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన.. పౌరుడికి గాయాలు

By ramya NFirst Published Mar 1, 2019, 11:16 AM IST
Highlights

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది.  మరోసారి కాల్పులకు తెగపడింది

 పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది.  మరోసారి కాల్పులకు తెగపడింది. జమ్మూకాశ్మీర్‌ సరిహద్దు రేఖ వెంబడి ఉన్న క్రిష్ణగటి సెక్టార్‌, ఉరి సెక్టార్ లోని పలు ప్రాంతాల్లో పాక్‌ సైన్యం దాడులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు గాయాలపాలయ్యాడు. 

భారత సైన్యానికి సంబంధించిన పోస్టులను లక్ష్యంగా చేసుకొని గత ఏడు రోజులగా వారు ఈ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. గురువారం ఉదయం పాక్‌ దళాలు మెండర్‌, రాజౌరి, నౌషరా సెక్టార్లలో కాల్పులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందన్నారు. 

గత ఏడాది పాకిస్తాన్‌ దాదాపు 3,000 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది గత 15 ఏళ్లలో అత్యధికం. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాకిస్తాన్‌ల పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కాల్పులతో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

click me!