బర్త్ డే వేడుక చేసుకోవడానికి భర్త దుబాయ్‌కు తీసుకెళ్లలేదని భార్య తీవ్ర ఆగ్రహానికి లోనైంది. భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు పగిలి తీవ్ర రక్తస్రావం తర్వాత భర్త స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత మరణించిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.
Couple: మహారాష్ట్రలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్‌కు తీసుకెళ్లలేదని భర్తపై దాడికి దిగింది. ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఆ గుద్దులతో తీవ్రంగా గాయపడిన భర్త అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆ తర్వాత మరణించాడు. ఈ ఘటన పూణెలో వన్వాడీ ఏరియాలోని విలాసవంతమైన రెసిడెన్షియల్ సొసైటీలో శుక్రవారం జరిగింది.
36 ఏళ్ల నిఖిల్ ఖన్నా నిర్మాణరంగంలో ఓ బిజినెస్ మ్యాన్. నిఖిల్ ఖన్నా 38 ఏళ్ల రేణుక ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అందించారు. ‘ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే... నిఖిల్, రేణుకలు గొడవ పడ్డారు. ఆమె భర్త డే వేడుకలు దుబాయ్‌లో చేయనందుకు ఆమె కోపగించుకుంది. బర్త్ డేకు, వివాహ వార్షికోత్సవానికి ఖరీదైన బహుమతులు ఇవ్వనందుకూ ఆమె హర్ట్ అయింది. ఢిల్లీలో కొందరి బర్త్ డే వేడుకలకు వెళ్లుదామని ఆమె కోరుతున్నా.. నిఖిల్ ఖన్నా అందుకు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ జరిగిందని వన్వాడీ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వివరించారు.
Also Read: All Party Meet: వచ్చే నెల 2న అఖిల పక్ష సమావేశానికి కేంద్రం పిలుపు.. ఎందుకంటే?
గొడవ జరుగుతున్నప్పుడు నిఖిల్ ఖన్నా ముఖంపై రేణుక పంచ్‌లు వేసింది. ఆ పంచ్‌లు బలంగా తగిలాయి. దీంతో నిఖిల్ ఖన్నా ముక్కు పగిలిపోయింది. కొన్ని పళ్లు కూడా విరిగిపోయాయి. భారీగా రక్తస్రావం చేసుకున్నాక నిఖిల్ స్పృహ కోల్పోయాడు.
రేణుక మీద పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.