మా సంబంధానికి అడ్డురావొద్దు.. అంటూ ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు....

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 11:17 AM IST
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను హతమార్చింది. ప్రియుడు అతని సహాయకుడితో కలిసి చంపించింది.
 

బెంగళూరు : వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తలను భార్యలు, భార్యల్ని భర్తలు హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. నీ భార్యతో నాకు సంబంధం ఉంది.. దీనికి అడ్డు రావద్దు అంటూ ఓ ప్రియుడు.. సదరు భర్తకు చెప్పాడు. అతను ఒప్పుకోకుండా.. గొడవకు దిగడంతో మరో వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత ప్రియురాలికి ఈ విషయం చెప్పడంతో ఆమె భర్త కనిపించడం లేదంటూ నాటకానికి తెరలేపింది. కర్ణాటకలోని బెంగళూరు, బాగేపల్లి తాలూకాలోని పూలనాయకనహళ్లి వద్ద ఓ మహిళ, ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి  భర్తను హత్య చేసింది. చిక్కబళ్లాపూర్ జిల్లా చేలూరు పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు చేలూరు నివాసి నరసింహప్ప (39), నిందితులు అతని భార్య అలువేలు (29), ఆమె ప్రేమికుడు వెంకటేశ్ (35), అతని సహాయకుడు శ్రీనాథ్ (25)లుగా గుర్తించారు. 

నవంబర్ 24న వెంకటేశం, శ్రీనాథలు నరసింహప్పను మద్యం తాగుదామని చెప్పి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తరువాత మద్యంమత్తులో ఉండగా వెంకటేశం తాను నరసింహప్ప భార్య అలువేలుతో సంబంధం పెట్టుకున్నానని..  దీనికి నరసింహప్ప అడ్డు రావద్దని వెంకటేష్ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే అదనుగా బావించిన వెంకటేశం, శ్రీనాథ్ లు నరసింహప్పను బండరాయితో కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక అతను వెంటనే మరణించాడు. ఆ తరువాత నరసింహప్ప మృతదేహాన్ని తీసుకువెళ్లి సమీపంలోని పొదల్లో పడేశారు. 

మహిళపై సామూహిక అత్యాచారం, సిగరెట్ తో ప్రైవేట్ భాగాల్లో కాల్చి, కత్తితో గాట్లు పెట్టి చిత్రహింసలు..

ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోయారు. కాసేపటికి గోనె సంచి, ప్లాస్టిక్‌ సంచులను తీసుకుని మళ్లీ తిరిగి వచ్చారు. మృతదేహాన్ని ఆ బ్యాగ్ లో పెట్టి పక్కనే ఉన్న ట్యాంక్‌ ఒడ్డున పాతిపెట్టారు. ఆ తరువాత హత్య జరిగిన విషయాన్ని ఇద్దరూ అలువేలుకు తెలియజేశారు. దీంతో అలివేలు మరో కొత్త నాటకానికి తెరలేపింది. నవంబర్ 29న భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వారి దర్యాప్తులో అలివేలుకు గత కొన్ని రోజులుగా ఓ నంబర్ నుంచి పలు కాల్స్ వస్తున్నట్లు సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీయగా వెంకటేశ్ దని తేలింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి విచారించగా.. తనకేం తెలియదని అన్యాయంగా ఇరికించాలని చూస్తున్నారని చిందులు తొక్కాడు. అయితే విచారణలో వారిమీద అనుమానం బలపడడంతో.. డిసెంబరు 2న ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.

నరసింహప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపినట్లు రవికుమార్ తెలిపారు. చేలూరు సమీపంలోని బండాపురానికి చెందిన వెంకటేశం తాపీ మేస్త్రీ అని, ఇతర నిందితులు, మృతుడు అతనితో కలిసి కూలీలుగా పనిచేస్తున్నారని.. క్యారెట్ లు ఏరే పనిలో కలిసి వెడతారని పోలీసులు తెలిపారు.

click me!