పెళ్లికి బైక్ మీద కుక్కతో వచ్చిన వరుడు... ఫోటో వైరల్..!

Published : Dec 05, 2022, 11:16 AM IST
 పెళ్లికి బైక్ మీద కుక్కతో వచ్చిన వరుడు... ఫోటో వైరల్..!

సారాంశం

అతని పెళ్లికి తాను కుక్కను తీసుకువెళ్లిన విధానాన్ని షేర్ చేశాడు.  పోల్....షేర్వానీ ధరించి బైక్‌పై తన పెంపుడు కుక్కతో వివాహ వేదికలోకి ప్రవేశించడాన్ని చూపిస్తుంది.

కుక్కలు.. కొంత ప్రేమ చూపిస్తే చాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయి. కుక్కలు... మనుషులకు మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. కాగా.... తాజాగా... దీనికి నిదర్శనంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి... తన పెళ్లికి .. మండపానికి కుక్కను తోడు తీసుకొని వెళ్లడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో... నెట్టింట వైరల్ గా మారింది.

 

దర్శన్ నందు పోల్ అనే వ్యక్తి దీనికి  సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతని పెళ్లికి తాను కుక్కను తీసుకువెళ్లిన విధానాన్ని షేర్ చేశాడు.  పోల్....షేర్వానీ ధరించి బైక్‌పై తన పెంపుడు కుక్కతో వివాహ వేదికలోకి ప్రవేశించడాన్ని చూపిస్తుంది. కుక్క కూడా చాలా క్యూట్ గా, ముద్దుగా కూర్చోవడం విశేషం.

ఈ వీడియో 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇది ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. 2 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. వరుడు చేసిన పనిని.. నెటిజన్లు మెచ్చుకున్నారు. చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 "వావ్ ప్రతి ఒక్కరూ మీలాగే ఉండాలని, వారి పెంపుడు జంతువును ఇంత మంచిగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను." అంటూ... మరో నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. "వరుడు కంటే కూడా కుక్క చాలా అందంగా ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !