ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో భార్య.. హఠాత్తుగా వచ్చిన భర్త..

By sivanagaprasad KodatiFirst Published 26, Sep 2018, 12:40 PM IST
Highlights

ఫేస్‌బుక్ మరోసారి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తనతో ఉండగా.. హఠాత్తుగా భర్త రావడాన్ని గమనించి.. అతనిపై కత్తితో దాడి చేసింది. చెన్నై కల్పాక్కం పెరుమాళ్ వీధికి చెందిన కిషోర్ కోఠారి ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు.

రాజస్తాన్‌కు చెందిన ఇతనికి సీమా అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు.. ఈ దంపతులతో పాటు సీమా చెల్లెలు బేబీ నివసిస్తున్నారు. సీమా, బేబీలకు రాజస్థాన్‌కు చెందిన రవిప్రకాశ్ అనే యువకుడితో మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. దీంతో నాటి నుంచి మేసేంజర్‌లో ఛాట్ చేసుకుంటూ వస్తున్నారు.

కిశోర్ కోఠారి బయటికి వెళ్లగానే అతని ఇంటికి వచ్చి అక్కచెల్లెళ్లతో మాట్లాడేవాడు. మంగళవారం రవిప్రకాశ్.. కిషోర్ ఇంటికి వచ్చాడు. అయితే కిశోర్ 11 గంటల సమయంలో హఠాత్తుగా ఇంటికి రావడంతో.. సీమా కంగారుపడింది.. భార్యతో పరాయి వ్యక్తి సన్నిహితంగా ఉండటం చూసి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆ సమయంలో సీమా వంటింట్లోని కత్తి తీసుకుని కిశోర్‌పై దాడి చేసింది. దీనిపై కల్పాక్కం పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన కిషోర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీమా, బేబీ, రవిప్రకాశ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. 
 
Last Updated 26, Sep 2018, 12:52 PM IST