నా కూతురిది యాక్సిడెంట్‌ కాదు.. లారీతో గుద్దించారు.. పోలీసులకు ఎస్‌ఐ ఫిర్యాదు

By sivanagaprasad kodatiFirst Published Sep 26, 2018, 11:53 AM IST
Highlights

న్యాయం కోసం ఓ ఇన్స్‌పెక్టర్ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కాడు. చెన్నై వాల్ ట్యాక్స్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌.. ప్రమాదవశాత్తూ జరగలేదని దీనిలో కుట్ర వుందని తనకు న్యాయం చేయాల్సిందిగా ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. చెన్నై షావుకారుపేట తిరుపళ్లి వీధిలో నివసిస్తున్న తుళసింగం నార్త్‌బీచ్ పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె రమ్యకు ఇటీవల వివాహం అయ్యింది.. ఆమె నుంగంబాక్కంలోని బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని యాక్టీవాపై రమ్య ఇంటికి బయలుదేరింది.

ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే స్టేషన్ దాటి వాల్‌ట్యాక్స్‌ రోడ్‌లో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ యాక్టీవాను ఢీకొట్టింది. దీంతో రమ్య ఎగిరి అవతల పడింది.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది.

ఎలిఫెంట్ గేట్ పోలీసులు కేసు నమోదు చేసి.. పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ పళనిని అరెస్ట్ చేశారు. అయితే తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని.. ఆమె మామ, బావమరిది కలిసి పథకం ప్రకారం తన కుమార్తెను లారీతో ఢీకొట్టించి హత్య చేశారని.. రమ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

click me!