బిడ్డను కనడానికి ఒప్పుకోవడం లేదని: భర్తను 11 సార్లు పొడిచి చంపింది

Siva Kodati |  
Published : Aug 23, 2019, 01:25 PM IST
బిడ్డను కనడానికి ఒప్పుకోవడం లేదని: భర్తను 11 సార్లు పొడిచి చంపింది

సారాంశం

ముంబైలోని నలాసొపొరా ప్రాంతానికి చెందిన సునీల్, ప్రణాలీ కదమ్ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రణాలీకి కొడుకును కనాలని వుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా..అతను అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. మరో బిడ్డ అవసరం లేదని వారించాడు

మరో బిడ్డను కనడానికి అంగీకరించడం లేదనే కోపంతో ఓ భార్య భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి చంపింది

ముంబైలోని నలాసొపొరా ప్రాంతానికి చెందిన సునీల్, ప్రణాలీ కదమ్ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రణాలీకి కొడుకును కనాలని వుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా..అతను అందుకు అంగీకరించలేదు.

ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. మరో బిడ్డ అవసరం లేదని వారించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణాలీ బుధవారం తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కూరగాయలు కోసే కత్తితో భర్తను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచింది.

తీవ్ర రక్తస్రావం కావడంతో సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రణాలీని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో నిందితురాలు పొంతనలేని సమాధానం చెబుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే చంపానంటూ వాంగ్మూలం ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ