వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Arun Kumar P   | Asianet News
Published : Oct 27, 2020, 08:07 AM IST
వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

సారాంశం

 కర్ణాటకలోని జిగణిలో దారుణం చోటుచేసుకుంది. 

బెంగళూరు: వేరేవాడి మోజులో పడి ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తనే అతి దారుణంగా కొట్టిచంపింది ఓ కసాయి మహిళ. ఈ దారుణం కర్ణాటకలోని జిగణిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... డెంగణికోటకు చెందిన మాదేశ్(35)టైలర్. అతడు కొన్నేళ్లు ప్రేమించి మరీ ప్రేమ అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. దీంతో బార్యాభర్తలిద్దరు జిగణిలో కాపురం పెట్టారు. మాదేశ్ అక్కడే ఓ టేలర్ షాప్ లో పనిచేయగా  ప్రేమ ఓ గార్మెంట్స్ లో పనిచేస్తోంది. 

అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వుండాల్సి వచ్చిన ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కానీ తమ బంధానికి మాదేశ్ అడ్డుగా వున్నాడని భావించిన అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఈనెల 17వ తేదీన మాదేశ్ ఒంటరిగా వుండగా రాళ్లతో కొట్టి చంపారు. అప్పటినుండి పరారీలో వున్న ప్రేమా, శివమల్లులతో పాటు వారికి సహకరించిన మల్లేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !