లేహ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలు: బీజేపీ ఘన విజయం

Published : Oct 26, 2020, 08:33 PM IST
లేహ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలు: బీజేపీ ఘన విజయం

సారాంశం

లేహ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది.  అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోని 26 స్థానాల్లో 15 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించింది.

శ్రీనగర్: లేహ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో  బీజేపీ ఘన విజయం సాధించింది. అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోని 26 స్థానాల్లో 15 స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించింది.

ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లలో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 9 సీట్లను గెలుచుకొంది. ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 

 

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.లేహ్ ఎంపీ జమ్యాంగ్ తీర్ధాంగ్ నంగ్యాల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో 89,776 మంది ఓటర్లో 65 శాతం మంది ఈ నెల 22న తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. జిల్లాలోని 26 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. 294 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు