మహిళపై లైంగిక వేధింపులు: ఎస్ఐ అరెస్ట్

Published : Oct 26, 2020, 09:05 PM IST
మహిళపై లైంగిక వేధింపులు: ఎస్ఐ అరెస్ట్

సారాంశం

ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన  ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నలుగురు మహిళలు ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన  ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నలుగురు మహిళలు ఫిర్యాదు చేశారు.

మహిళల ఫిర్యాదుల ఆధారంగా శనివారం నాడు ఆయనను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 17న సైక్లింగ్ చేస్తున్న ఓ యువతిని పునీత్ తన కారులో వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని వెస్ట్ ఢిల్లీలోని ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

పునీత్ వాడిన కారుకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడ లేదని పోలీసులు గుర్తించారు. బాధిత యువతితో పాటు మరో నలుగురు మహిళలు కూడ ఆయనపై ఫిర్యాదు చేశారు.

నాలుగు వేర్వేరు కేసులు ఆయనపై నమోదయ్యాయి. రోడ్డుపై ఇతర వాహనాలు వస్తున్న విషయాన్ని గుర్తించిన బాధిత మహిళ గట్టిగా అరిచింది. దీంతో అతను పారిపోయాడు. 

ఇదిలా ఉంటే నిందితుడిని పట్టుకొనేందుకు పోలీసులు 200 సీసీ కెమెరాలను ఉపయోగించారు. అంతేకాదు 200 మంది పోలీసులను మోహరించారు.నిందితుడు ఉపయోగించిన కారుకు నెంబర్ లేదని గుర్తించారు పోలీసులు.

ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ యూనిట్ లో అతడు విధులు నిర్వహిస్తున్నాడు.  ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !