భర్త ప్రియురాలిని చంపి, అడవిలో పడేసి... వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య ఘాతుకం....

Published : May 10, 2023, 03:25 PM IST
భర్త ప్రియురాలిని చంపి, అడవిలో పడేసి... వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య ఘాతుకం....

సారాంశం

ఇద్దరు పిల్లల తండ్రి మరో మహిళతో అక్రమ సంబంధం.. భార్య పదే పదే వారించినా వినకపోవడంతో.. కాంట్రాక్ట్ కిల్లర్ తో భర్త ప్రియురాలిని చంపించిన భార్య. 

జార్ఖండ్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్త ప్రియురాలిని దారునంగా హత్య చేయించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త వివాహేతర సంబంధంతో విసిగిపోయిన ఆ మహిళ తన భర్త ప్రేమికురాలిని పథకం ప్రకారం హత్య చేసింది. ఎన్నిసార్లు వారించినా.. సదరు మహిళ తన భర్తను విడిచిపెట్టడం లేదనే కోపంతో, ప్రేమికురాలిని చంపడానికి భార్య కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించింది. 

వారు మహిళ భర్త, అతని ప్రియురాలిని బాగా కొట్టారు. ఆ తర్వాత కూడా ఆమె తన భర్తను వదలలేదు. దీంతో విసిగిపోయిన సదరు మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన భర్త ప్రియురాలిని చంపేసింది. మృతదేహం దొరకకుండా మాయం చేసింది. మహిళ మృతదేహాన్ని దొరకకుండా దూరంగా పారేసింది. హత్య జరిగిన తొమ్మిది రోజుల తర్వాత దిగ్భ్రాంతికరమైన కుట్ర బయటపడింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు.

హత్య చేసిన తర్వాత వారు ఆ మహిళ మృతదేహాన్ని అడవిలో పడేశారు. తన భర్త ప్రేమికురాలిని హత్య చేసిన తర్వాత, సాక్ష్యాలను నాశనం చేయడానికి మృతదేహాన్ని అడవిలో పడేశారు. అయితే, మహిళ కనిపించకపోవడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో తొమ్మిది రోజుల్లోనే షాకింగ్ హత్య విషయం బహిర్గతం అయ్యింది. ఈ ఘటన బాగోదర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. 

రాజస్తాన్ సీఎం గెహ్లాట్ మాట్లాడుతుండగా ‘మోడీ.. మోడీ..’ నినాదాలు.. ప్రధాని ఏం చేశాడంటే?

ఏప్రిల్ 28న దోభచన్ అడవుల్లో చెట్టుకు కట్టివేయబడిన మహిళ మృతదేహం లభ్యమైంది. చనిపోయిన మహిళ పేరు కుంతీదేవి. మహిళ భర్త రాజేంద్ర షా తన భార్య కనిపించడం లేదని బాగోదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ప్రకారం.. విచారణ జరపగా.. హత్యకేసు వెలుగు చూసింది. దీంతో గుర్తు తెలియని నేరస్థులపై హత్య కేసు నమోదు చేశారు.

దీనిపై దర్యాప్తు చేసేందుకు గిరిదిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం మహిళ హత్య వెనుక షాకింగ్ కారణాన్ని వెలుగులోకి తీసుకురావడంతో, ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

సాంకేతిక విచారణ ద్వారా హత్యను ఛేదించారుమరణించిన కుంతీదేవి రోజువారీ కూలీ. ప్రత్యేక దర్యాప్తు బృందం గత కొన్ని రోజులుగా మహిళ ఆచూకీని కనిపెట్టింది. ఆమె మొబైల్ కాల్ రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా, ఏప్రిల్ 24న కుంతి మరో మహిళతో కలిసి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ మహిళ కుల్గో నివాసి నీలకంఠ మహతో భార్య మీనా దేవి అని తేలింది.

తదుపరి విచారణ కొనసాగుతుండగా, కుంతిని చంపేందుకు మీనా దేవి పథకం వేసినట్లు వెలుగులోకి వచ్చింది. కుంతిని చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్ అజయ్ కుమార్‌కు మీనా సుపారీ ఇచ్చింది. ఈ కేసులో మీనా, అజయ్ కుమార్ ఇద్దరినీ లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఓ మైనర్ నిందితుడు కూడా ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్