కూల్ డ్రింక్ లో సైనెడ్ కలిపి భర్త హత్య.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 8:09 AM IST
Highlights

వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తకు కూల్ డ్రింక్ లో సైనెడ్ కలిపి ఇచ్చి హతమార్చిందో భార్య. చివరికి ప్రియుడితో సహా పోలీసులకు పట్టుబడింది. 

గుజరాత్ : వివాహేతర సంబంధాల నేపథ్యంలో కాపురాలను కూల్చుకుంటున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తను అతడి స్నేహితుడిని అతి దారుణంగా హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఓ భార్య.. ప్రియుడితో కలిసి పక్క పక్కా ప్లాన్ ప్రకారం.. భర్తను హతమార్చింది. అయితే పోస్టుమార్టం నివేదికలో వెలువడిన ఓ విషయం అనుమానాలు రేకెత్తించడంతో ఆమె ప్రియుడితో సహా అడ్డంగా దొరికిపోయింది. గుజరాత్లోని జునాగఢ్ పట్టణానికి చెందిన మెహమూదా, రఫీక్ లు భార్యభర్తలు. 

మొదట్లో వీరిద్దరి కాపురం అన్యోన్యంగానే కొనసాగేది. అయితే ఎనిమిది నెలల క్రితం ఆసిఫ్ చౌహాన్ అనే వ్యక్తితో మెహమూదాకు  పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అప్పటివరకు బాగానే ఉన్న భర్త నచ్చకపోవడం మొదలుపెట్టాడు. ఆసిఫ్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే దీనికి తన భర్త అడ్డుగా ఉన్నాడని.. అతడిని ఎలాగైనా హతమార్చాలని, అడ్డుతొలగించుకోవాలని  పథకం వేసింది. దీనికోసం కూల్ డ్రింక్ లో సైనెడ్ కలిపింది. సైనెడ్ ను తమకు తెలిసిన ఇమ్రాన్ అనే వ్యక్తితో  తెప్పించారు. ఆ తర్వాత కూల్ డ్రింక్ లో దాన్ని కలిపారు.  

విశాఖపట్నంలో దారుణం.. నీళ్ల డ్రమ్ములో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం.. చంపి, ముక్కలు చేసి..

ప్రియుడు ఆసిఫ్ తో కలిసి.. మెహమూదా ఆ కూల్ డ్రింక్ బాటిల్ ని భర్త రఫీక్ నడిపే ఆటోరిక్షాలో పెట్టించింది. ఆటో రిక్షా నడుపుతున్న సమయంలో రఫీక్, అతని స్నేహితుడు భరత్ అలియాస్ జోహాన్ లు ఈ కూల్ డ్రింక్ తాగారు. ఆ తర్వాత స్పృహ తప్పిపోయారు.  అలా మృత్యుముఖంలోకి జారుకున్నారు. వీరి హఠాత్ మరణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  మొదలుపెట్టారు. ఈ క్రమంలో మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు శరీరంలో సైనెడ్ అవశేషాలు ఉన్నట్లుగా తెలిపారు. 

అదే సమయంలో ఆటోలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ లో విషం ఉందని ఫోరెన్సిక్ నివేదికలో తేలడంతో.. హత్య కోణంలో దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవితేజ వాసంశెట్టి ఈ కేసు వివరాలను తెలియజేశారు. మొదట వీరు కల్తీమద్యం తాగడం వల్ల మరణించినట్లుగా అనుమానించారు. అయితే కూల్ డ్రింక్ బాటిల్ లో సైనెడ్ అవశేషాలు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేసి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా ఆసిఫ్, మెహమూదా, ఇమ్రాన్ లను  గుర్తించారు. వీరిని అరెస్ట్ చేశారు. 

click me!