ఇదే సరైన సమయం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వెనక్కి తీసుకోవాలి

By Rajesh KarampooriFirst Published Dec 5, 2022, 6:05 AM IST
Highlights

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)పై ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పీఓకేని వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యమని, పీఓకే గురించి ప్రధాని మోదీకి గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో తీర్మానం చేసిందని హరీశ్ రావత్ అన్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) అనేది సున్నితమైన , భావోద్వేగంతో కూడుకున్న అంశం. తాజాగా ఈ అంశంపై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీష్ రావత్ సంచలన ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను విముక్తి చేయడం మన కర్తవ్యమన్నారు. పీఓకే గురించి ప్రధాని మోదీకి గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో తీర్మానం చేసిందని హరీశ్ రావత్ అన్నారు. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వ అజెండాలో ఉండాలని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీనమైన స్థితిలో ఉంది కాబట్టి ఈ సమయంలో మనం పీఓకేని వెనక్కి తీసుకోవచ్చనని కీలక వ్యాఖ్యలు చేశారు.  

భారత పార్లమెంటు సమావేశాల్లో  కూడా పీఓకేపై చాలా చర్చలు జరిగాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగమవుతుందని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని అధికార పార్టీ బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా చెప్పారు. సైన్యం సన్నద్ధంగా ఉందని, చర్యలకు సిద్ధంగా ఉందని పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల కోసం బలగాలు ఎదురుచూస్తున్నాయి.
 
ఇటీవల పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్ గా ఎన్నికైన జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)పై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి పొందాలని భారత్ తన లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ మేరకు భారత్ దాడులు చేస్తుంది. అదే సమయంలో దేశాన్ని రక్షించడానికి పాకిస్తాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారని  ఆర్మీ చీఫ్ అన్నారు. "నేను ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాను, పాకిస్తాన్ సాయుధ దళాలు మన మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని రక్షించడానికి మాత్రమే కాకుండా, శత్రువుపై పోరాటాన్ని తిరిగి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి" అని జనరల్ మునీర్ పేర్కొన్నారు. 

మునీర్ వ్యాఖ్యలపై భారత సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందిస్తూ ధీటుగా సమాధానమిచ్చారు. భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా అక్టోబర్ 28న రక్షణ మంత్రిరాజ్‌నాథ్ సింగ్ కూడా కీలక ప్రకటన చేశారు. శరణార్థులందరూ తమ ఇళ్లకు, భూమికి తిరిగి వస్తారని చెబుతూ.. PoKని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పునర్ సంకల్పించుకుందని అన్నారు. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య కాంగ్రెస్ యొక్క ఈ డిమాండ్ మోడీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా పరిగణించబడుతుంది. అలాగే రానున్న శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశముంది. 

click me!