ప్రియుడితో ఇంట్లో నుండి జంప్: ఇంటికొచ్చాక భర్తకు షాకిచ్చిన వివాహిత

Published : Oct 24, 2021, 10:41 AM IST
ప్రియుడితో ఇంట్లో నుండి జంప్: ఇంటికొచ్చాక భర్తకు షాకిచ్చిన వివాహిత

సారాంశం

ప్రియుడి మోజూలో పడిన వివాహిత భర్తను గొంతు పిసికి చంపింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఉణిసెట్టి గ్రామంలో చోటు చేసుకొంది.  అయితే తన భర్త ఆత్మహత్య చేసుకొన్నాడని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది.

బెంగుళూరు: Extra marital affaiar అడ్డుగా ఉన్నాడని భర్తను Lover తో కలిసి  భార్య  హతమార్చింది.  ఈ ఘటనకు పాల్పడిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని  కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని డెంకణికోట సమీపంలోని ఉణిసెట్టి గ్రామానికి చెందిన Ayyappa టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన వయస్సు 37 ఏళ్లు.  అతని భార్య  రూప. ఆమె వయస్సు 23 ఏళ్లు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.అయ్యప్ప బంధువు తంగమణి (20) జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో ఉంటున్నాడు.  తంగమణికి రూపకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

also read:ప్రేమించి పెళ్లిచేసుకుని.. మరొకరితో లవ్ లో పడ్డ భార్య.. భర్త అడ్డుతొలగించుకోవాలని దారుణం..

మూడు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం బంధువులు వారిని పట్టుకుని ఎవరి ఇళ్లకు వారి పంపారు.  తన బంధువుతో భార్య పారిపోవడంతో అవమానంగా భావించిన అయ్యప్ప రెండు దఫాలు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే రెండుసార్లు కూడా ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

ప్రియుడితో జీవితం పంచుకోవాలని భావించిన రూప ప్రియుడితో కలిసి భర్తను చంపాలని భావించింది.  శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అయ్యప్పను ప్రియుడితో  కలిసి ఆమె గొంతు పిసికి చంపింది.  అయితే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు గాను తన భర్త  ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రూప విలపించింది.

డెంకణీకోట పోలీసులు అనుమానంతో రూప, తంగమణిలను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో అయ్యప్పను  తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్