భర్త కంటే భార్యే ఎక్కువ సంపాదిస్తున్నది.. భరణం చెల్లించడంపై కోర్టు ఆసక్తికర తీర్పు

By Mahesh KFirst Published May 28, 2023, 4:13 PM IST
Highlights

భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తున్నది. అయినా.. తనకు భరణం కావాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
 

న్యూఢిల్లీ: సాధారణంగా భార్యకు భర్త మెయింటెనెన్స్ ఇస్తాడు. భార్య, భర్తలు విడిగా ఉన్నప్పుడు.. ఆమెకు, వారికి కలిగిన సంతానానికి డబ్బులు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది. ఇది సాధారణంగా చాలా కేసుల్లో కనిపించేదే. కానీ, మహారాష్ట్రలోని ఓ సెషన్స్ కోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తున్నదని కోర్టు పేర్కొంది. కాబట్టి, భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఇచ్చిన మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సమర్థించింది. ఆమె యేటా రూ. 4 లక్షలు సంపాదిస్తున్నదని, ఇది ఆమె భర్త కంటే ఎక్కువ అని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

సంపాదిస్తున్న మహిళ కూడా భరణం పొందడానికి అర్హురాలే. అయితే, అందుకు ఇతర పరిస్థితులనూ పరిశీలించాల్సి ఉంటుంది. భర్తకు భార్య కంటే ఎక్కువ సంపాదన కలిగి ఉండి వారికి భరణం చెల్లించడం, లేదా భరణం పొందాల్సిన స్థితిలో భార్య ఉండటం వంటి విషయాలను పరిశీలించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. కానీ, ప్రస్తుత స్థితిలో భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. 

ఓ మహిళ తన భర్త, అత్తవారింటి సభ్యులపై 2021లో గృహ హింస కేసు పెట్టింది. తనకు సంతానం కలిగిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపించింది. వారి పాప కోసం నెలకు రూ. 10 వేలు చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. 

తన భర్తతో కలిసి ఉన్నప్పుడే కన్సీవ్ అయ్యానని ఆమె వివరించింది. అదే సందర్భంలో తన భర్త లైంగిక పరమైన చికిత్స తీసుకుంటున్నాడని, అది తనకు తెలుపలేదని పేర్కొంది. అప్పుడు తాను గర్భం దాల్చిన విషయం భర్త బంధువులు తెలుసుకుని తన క్యారెక్టర్ ను అనుమానిస్తున్నారని వివరించింది. 

Also Read: ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంగా ట్రీట్ చేస్తున్నారు: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు

ప్రస్తుత స్థితిలో కేసులో లోతైన వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఇప్పుడే ఆ పాప తండ్రి ఎవరు అనే విషయంపై వాదనలు అవసరం లేదని, ఈ స్టేజ్‌లో అందుబాటులో ఉన్న ఆధారాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారని వివరించింది. మెజిస్ట్రేట్ కోర్టు సరైన తీర్పే ఇచ్చిందని పేర్కొంది.

click me!