మోడీపై కాంగ్రెస్ వివాదాస్పద పోస్టు: మండిపడ్డ బీజేపీ

Published : May 28, 2023, 03:19 PM ISTUpdated : May 28, 2023, 03:29 PM IST
 మోడీపై  కాంగ్రెస్ వివాదాస్పద పోస్టు: మండిపడ్డ బీజేపీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీపై  కాంగ్రెస్ వివాదాస్పద పోస్టును సోషల్ మీడియాలో  పోస్టు  చేసింది.  ఈ వ్యాఖ్యలపై  బీజేపీ మండిపడింది.  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై  కాంగ్రెస్  సోషల్ మీడియాలో  వివాదాస్పద వ్యాఖ్యలు  చేసింది.  ట్విట్టర్ వేదికగా  కాంగ్రెస్  పార్టీ  ఈ వ్యాఖ్యలు  చేసింది.  ఈ వ్యాఖ్యలపై  బీజేపీ  మండిపడింది.   కాంగ్రెస్  చేసిన  వ్యాఖ్యలు  140  కోట్ల భారతీయులను  అవమానించడమేనని   బీజేపీ  పేర్కొంది. భారత తొలి ప్రధాని  నెహ్రు పాదాల వద్ద  ప్రధాని మోడీ ఫోటోతో  కాంగ్రెస్  పార్టీ ట్విట్టర్ వేదికగా  వివాదాస్పద పోస్టు  చేసింది.    నెహ్రు పాదాల వద్ద  మోడీ  బొమ్మను  చిన్నదిగా  చూపించారు.

ఈ పోస్టుపై  బీజేపీ  నేత  మంజీందర్ సింగ్  మండిపడ్డారు.  కాంగ్రెస్  పార్టీ   సోషల్ మీడియాలో  చేసిన  పోస్టు   మోడీకే  కాకుండా దేశంలోని  వెనుకబడిన  వర్గాలకు  కూడా  అవమానమని  ఆయన  అభిప్రాయపడ్డారు.  

 

రాజ్యాంగబద్దమైన  ప్రధాని పదవిలో  ఉన్న మోడీని  అవమానించడం  కాంగ్రెస్  తీరుకు అద్దం పడుతుందని  ఆయన  వ్యాఖ్యానించారు.   ఈ రకమైన పోస్టు దేశంలోని  140 కోట్ల ప్రజలను  అవమానించడమేనని  కూడా  ఆయన వ్యాఖ్యానించారు. 

 

కాంగ్రెస్   పోస్టు  చేసిన   ప్రధాని నరేంద్ర మోడీ  అభిమానులు మండిపడ్డారు. వచ్చే  ఎన్నికల్లో  ప్రజలు మిమ్మల్ని  జీరోకు దించుతారని  మోడీ అభిమానులు  సోషల్  మీడియాలో పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్