గర్ల్ ఫ్రెండ్ తో భర్త కారులో షికారు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉతికారేసిన భార్య...

Published : Aug 17, 2021, 09:38 AM IST
గర్ల్ ఫ్రెండ్ తో భర్త కారులో షికారు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉతికారేసిన భార్య...

సారాంశం

భర్త తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారులో ఔరంగాబాద్లోని ప్రముఖ హోటల్ వద్దకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి హోటల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా... వెంటనే వెనకనుంచి భార్య వైపు వేగంగా పరిగెత్తుకొచ్చింది. ఎదురుగా తన భార్య ప్రత్యక్షం కావడంతో భర్త షాక్ అయ్యాడు. 

ముంబై :  భర్త మరో మహిళతో కలిసి ఉండగా వారి బాగోతాన్ని భార్య రెండ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది. భర్తతోపాటు పట్టుబడిన మహిళలు చెడామడా ఉతికేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్కు చెందిన ఓ వ్యక్తికి అంతకుముందే పెళ్లయింది. అయితే ఇటీవల అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో కలిసి హోటల్, రెస్టారెంట్ అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతనిపై కొన్ని రోజుల నుంచి ఫోకస్ పెట్టింది. అతను ఓ రోజు ఇంటి నుంచి బయటకు  బయటకు వెళ్లాడు. భార్య కూడా తననే ఫాలో అవుతూ వెళ్ళింది.

 ఈ క్రమంలో భర్త తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కారులో ఔరంగాబాద్లోని ప్రముఖ హోటల్ వద్దకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి హోటల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా... వెంటనే వెనకనుంచి భార్య వైపు వేగంగా పరిగెత్తుకొచ్చింది. ఎదురుగా తన భార్య ప్రత్యక్షం కావడంతో భర్త షాక్ అయ్యాడు. కారులో కూర్చుని ఉండడంతో ఏం చేయాలో తెలీక సతమతమయ్యాడు. అంతలోనే కారులోని మహిళను చూసిన భార్య కోపం నషాళానికి అంటింది.

అగ్గిమీద గుగ్గిలం అయ్యి మహిళలు బయటకు ఈడ్చేసింది.  మహిళ ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉండటంతో దానిని తొలగించడానికి ప్రయత్నిస్తూ జుట్టు పట్టుకుని చితకబాదింది. ఆమె ఎవరంటూ భర్తను ప్రశ్నించింది.  అయితే భర్త తన భార్య నుంచి గర్ల్ ఫ్రెండ్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా అతని కూడా వాయించేసింది. దీంతో స్థానికంగా గందరగోళంగా మారడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జనాలు గుమిగూడారు.  

అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అనేక మంది మద్దతు పలికారు. అయితే మహిళను కొట్టడం కంటే ఈ విషయమై ముందుగా ప్రశ్నించాలని సలహా ఇస్తున్నారు.  ‘అందరికి బయటే బిర్యానీనే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పప్పును తినరు. ఎందుకు’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamil Nadu Gas Leak: తమిళనాడులో ఘోర విషాదం గ్యాస్ లీక్ స్పాట్ లోనే 8మంది మహిళలు | Asianet Telugu
PM Modi Performs Yoga: ఢిల్లీ లోని ఎర్రకోట ప్రాంగణంలో యోగా ఆసనాలు వేసిన మోదీ | Asianet News Telugu