కూర రుచిగా లేదన్నాడని.. భర్త తల పగలకొట్టిన భార్య..!

Published : Sep 08, 2021, 08:45 AM ISTUpdated : Sep 08, 2021, 08:49 AM IST
కూర రుచిగా లేదన్నాడని.. భర్త తల పగలకొట్టిన భార్య..!

సారాంశం

 కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్ పై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. దీంతో.. అతడి తలకు తీవ్ర గాయమైంది.

భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే.. ఆ మాత్రానికే.. ఓ మహిళ భర్త పట్ల దారుణంగా ప్రవర్తించింది.  కూర బాలేదు అని చెప్పాడని.. ఓ మహిళ ఏకంగా భర్త తల పగలకొట్టింది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో దినేశ్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజూలాగే భర్త కోసం ఆమె వంట చేసింది. అయితే.. కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్(40).. ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు. దీంతో.. భోజనం అంత రుచిగా లేదని చెప్పాడు. దీంతో.. వారి మధ్య వాదన మొదలైంది.

దీంతో.. కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్ పై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. దీంతో.. అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆ గొడవను గమనించిన పొరుగింటి వ్యక్తి అక్కడకు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం ఈ ఘటనపైద దినేశ్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. తమ మధ్య తరచూ ఇలాంటి గొడవలే జరుగుతున్నాయని .. బాధితుడు చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ