
న్యూఢిల్లీ: ఆ ఇంట్లో రాత్రి అందరూ ఎప్పట్లాగే పడుకున్నారు. కానీ, అదే రాత్రి ఓ దారుణం జరిగింది. ఉన్నట్టుండి ఆమె మేలుకొని పదునైన ఆయుధాన్ని చేతబట్టింది. అందరూ పడుకుని ఉండగా తనను కట్టుకున్న భర్త తల నరికేసింది. కొడుకు లేచి గగ్గోలు పెట్టగానే తలను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి దేవుడి గుడిలో పెట్టింది. ఆ తర్వాత మరో రూములోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం త్రిపురలో చోటుచేసుకుంది.
ఖొవాయ్ జిల్లా ఇందిరా కాలనీ గ్రామంలో రబీంద్ర తంతి, ఆమె భార్య కలిసి జీవిస్తున్నారు. బీరంద్ర తంత్రి దినసరి కూలీ. వారికి ఇద్దరు మైనర్ కుమారులు ఉన్నారు. శనివారం రాత్రి 50 ఏళ్ల రబీంద్ర తంత్రిని 42 ఏళ్ల భార్య హతమార్చింది. తల నరికేసింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేవని ఖొవాయ్ ఎస్పీ భానపద చక్రబొర్తి తెలిపారు. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై కొడుకు కొన్ని వివరాలు చెప్పాడు.
తన తల్లి మానసికంగా దుర్భలంగా తయారైందని, ఆమెకు స్థానికంగా ఓ తాంత్రిక చికిత్స అందిస్తున్నట్టు కొడుకు చెప్పాడు. తన తల్లి ఎప్పుడూ మాంసం తినేది కాదని, కేవలం కూరగాయలు వంటివే తినేదని పెద్ద కొడుకు అన్నాడు. అయితే, నిన్న రాత్రి ఆమె అనూహ్యంగా మాంసం తిన్నదని వివరించాడు. చికెన్ తిన్న తర్వాత తాము అందరం పడుకున్నామని పేర్కొన్నాడు. కానీ, ఏదో చప్పుడైతే తనకు సడెన్‌గా మెలకువ వచ్చిందని తెలిపాడు. చూస్తే.. తాను షాక్ అయ్యానని, పదునైన ఆయుధాన్ని చేత పట్టుకుని ఆమెపై రక్తం చిమ్మి ఉన్నదని వివరించాడు. తాము వెంటనే కేకలు వేశామని అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె వెంటనే గది వదిలి పరుగు పెట్టిందని, తన తండ్రి తలను తమ ఆలయంలో పెట్టిందని చెప్పాడు. ఆ తర్వాత తన తల్లి స్వయంగా ఒక గదిలోకి వెళ్లి రూమ్ గది మూసేసుకుందని పేర్కొన్నాడు.
తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని వివరించాడు. పోలీసులు స్పాట్‌కు వచ్చారు. రబీంద్ర తంత్రి మృతదేహాన్ని తాము రికవరీ చేసుకున్నట్టు ఎస్పీ చక్రబొర్తి తెలిపారు. ఆ నిందితురాలిని అరెస్టు చేసినట్టూ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. ఓ ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. కొన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. కాగా, ఆ నిందితురాలి మానసిక అనారోగ్యం గురించి ప్రస్తావించగా.. వైద్యలు నివేదిక వచ్చే వరకు తాము దానిపై వ్యాఖ్యానించబోమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా నరసరావుపేట లో దారుణం జరిగింది. కన్న తల్లిని కత్తి తో పొడిచి దారుణంగా హత్య చేసిన కొడుకు. స్థానిక పల్నాడు బస్టాండ్ సమీపాన రామిరెడ్డిపేటలోని ఠాగూర్ స్కూల్ వద్ద నివాసముంటున్న బత్తుల శివమ్మని కొడుకు బత్తుల వెంకట రావు దారుణం గా హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు