జమ్మూ కాశ్మీర్ షోపియాన్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..

Published : Dec 20, 2022, 10:38 AM IST
జమ్మూ కాశ్మీర్ షోపియాన్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారు.

జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరించారు.

ప్రియురాలి భర్తను చంపి, అతడి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన ప్రియుడు.. మద్యం మత్తులో చెప్పేయడంతో..

ఈ ఎన్ కౌంటర్ లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను షోపియాన్ కు చెందిన లతీఫ్ లోన్, అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. కాశ్మీరీ పండిత పురాణ కృష్ణ భట్ హత్యలో లతీఫ్ లోన్, నేపాల్ కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో ఉమర్ నజీర్ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఉగ్రవాదుల నుంచి ఏకే 47 రైఫిల్, రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

‘‘నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి గుర్తింపు నిర్ధారించబడుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘‘ షోపియాన్ జిల్లాలోని ముంఝ్ మార్గ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వివరాలు తెలియాల్సి ఉంది’’ అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆర్మీ, పోలీసు బలగాలు పనిలో ఉన్నాయని, ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families