
ఛత్తీస్ గఢ్ : అందంగా లేవు.. నల్లగా ఉన్నావు.. ఈ మాటలు పదే పదే వింటే... సదరు వ్యక్తి కోపంతో, ఆత్మన్యూనతతో కుంచించుకుపోవడం సహజం. అదే కట్టుకున్న భర్తే అలా కామెంట్ చేస్తే.. ఆ సాకుతో వేధింపులకు పాల్పడితే.. ఆ భార్య పరిస్థితి ఏమిటి? యేళ్లుగా సాగుతున్న ఈ వివక్షాపూరిత వ్యాఖ్యలకు విసిగిపోయిన ఆ భార్య భర్తను దారుణంగా కడతేర్చింది.
అందంగా లేవు.. నల్లగా ఉన్నావ్ అంటూ.. భర్త భార్య మీద వేధింపులకు పాల్పడుతున్నాడు. విసిగిపోయిన భార్య భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. ఈ క్రమంలో అతడి మర్మాంగాన్ని కోసేసింది. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి అమలేశ్వర్ గ్రామంలో అనంత్ (40), సంగీత దంపతులు నివసిస్తున్నారు. నల్లగా ఉన్నావు, అందంగా లేవు అంటూ అతను తన భార్యను తరచూ వేధించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఆదివారం సైతం భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
బ్రేకింగ్.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల నిషేధం.. తక్షణమే అమల్లోకి..
ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, ఇంట్లోని గొడ్డలితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత.. ఆమె తన భర్తను ఎవరు హత్య చేశారంటూ గ్రామస్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. చివరికి.. పోలీసుల విచారణలో నేరం అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసు అధికారి దేవాన్ష్ రాథోడ్ మంగళవారం వెల్లడించారు. మృతుడి భార్య చనిపోవడంతో అతను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితురాలుసంగీతకు, మృతుడు అనంత్ సొన్వానికి చాలా కాలం కిందట పెళ్లయింది. సంగీత అనంత్ కు రెండో భార్య. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి భార్య సంతానంగా కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్.. అంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. పెళ్లైన నాటినుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ వేధించేవాడు.