యూపీ కేబినెట్ కీల‌క నిర్ణయం.. తొలి టైగర్ రిజర్వ్ నిర్మాణానికి ఆమోదం.. పూర్తి వివరాలు

By Rajesh KarampooriFirst Published Sep 28, 2022, 6:24 AM IST
Highlights

యూపీ కేబినెట్ కీల‌క నిర్ణయం తీసుకుంది. బుందేల్‌ఖండ్‌లో నిర్మించనున్న  టైగర్ రిజర్వ్ కు  యోగి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రాణిపూర్ టైగర్ రిజర్వ్ గా నిర్ణ‌యించారు. 

యూపీ కేబినెట్ నిర్ణయం: యూపీలోని యోగి ప్రభుత్వం  మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. బుందేల్‌ఖండ్‌లో తొలి టైగర్ రిజర్వ్‌కు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం..  బుందేల్‌ఖండ్‌లో మొదటి టైగర్ రిజర్వ్‌ను నిర్మించనున్నారు, దీనికి రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని పేరు పెట్టారు. దీంతో పాటు చిత్రకూట్ జిల్లాలో కూడా అభయారణ్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంగళవారం సీఎం యోగి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఆమోదం 
 
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 38 (v) ప్రకారం.. రాణిపూర్ టైగర్ రిజర్వ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టైగర్ రిజర్వ్ 52989.863 హెక్టార్లలో విస్తరించి ఉంటుంది, ఇందులో 29958.863 హెక్టార్లు బఫర్ ఏరియా మరియు 23031.00 కోర్ ఏరియాలు ఉన్నాయి. హెక్టార్ కోర్ ఏరియా ఇప్పటికే రాణిపూర్ వైల్డ్‌లైఫ్‌గా నోటిఫై చేయబడింది. ఇందుకోసం రాణిపూర్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన పోస్టులకు ఆమోదం కూడా లభించింది. ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, మచ్చల జింకలు, సాంబార్, చింకారా, వివిధ పక్షులు, ఇతర క్షీరదాలు ఉన్నాయి.

జంతువులు, పక్షుల కోసం నిర్మించే రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు రాష్ట్రానికి మలుపుగా మారుతుంది. బుందేల్‌ఖండ్‌లో వన్యప్రాణుల రక్షణతో పాటు, పర్యాటక పరిశ్రమకు దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, రాష్ట్రంలో పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడతాయి. దీని ద్వారా స్థానిక ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇటీవల, ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుండి తీసుకువచ్చిన 8 చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో అభయారణ్యంలో విడిచిపెట్టిన విష‌యం తెలిసిందే..  దీని తరువాత, యుపిలో ఇటువంటి కసరత్తు వెనుక అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ ప‌నుల‌ను చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

click me!