పెళ్లైన ఆరునెలలకే విడాకులు కోరిన భార్య.. కిరాయి మనుషులతో హత్య చేయించిన భర్త...

Published : May 18, 2023, 11:01 AM ISTUpdated : May 18, 2023, 11:03 AM IST
పెళ్లైన ఆరునెలలకే విడాకులు కోరిన భార్య.. కిరాయి మనుషులతో హత్య చేయించిన భర్త...

సారాంశం

భర్తను విడాకులు కోరడమే కాకుండా పెద్ద మొత్తంలో మనోవర్తి డిమాండ్ చేసింది ఓ భార్య. అంతేకాదు అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకోలేనని తేల్చి చెప్పింది. దీంతో భార్యను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు భర్త. 

ఢిల్లీ : ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్య విడాకులు అడిగిందని ఆమెను మనుషుల్ని పెట్టి చంపించాడో వ్యక్తి. దీనికోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. భార్య విడాకులు కోరడమే కాకుండా అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకోవడానికి నిరాకరించిందట. దీంతో ఎలాగైనా ఆమెను చంపాలనుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. 

భర్త నుంచి విడాకులు కోరిన ఓ భార్య, మనోవర్తి కింద భారీ మొత్తాన్ని డిమాండ్ చేసింది. ఆ మహిళను కాంట్రాక్ట్ కిల్లర్ల చేతిలో హత్యకు గురయ్యింది. ఈ ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ప్రియురాలిని కేబుల్ వైర్‌తో కొట్టి, అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్‌లో కారం చల్లి... ఓ వ్యక్తి అమానుషం...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో నివాసం ఉంటున్న ఎస్‌కే గుప్తా (71) సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న తన కుమారుడు అమిత్ గుప్తా (45)ను చూసుకుంటుందని భావించి ఆరు నెలల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

అయితే, వివాహం అయిన కొద్ది రోజులకే తనకు విడాకులు కావాలని పట్టుబట్టింది ఆమె. అంతేకాదు, మనోవర్తి కింద కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. దీంతో తాను పెళ్లి చేసుకుందే కొడుకు కోసం అని.. అలా కాకుండా తాను కోరుకున్నట్లు విషయాలు జరగలేదు. దీంతో వారి సంబంధం చాలా విషమంగా మారింది, గుప్తా తన భార్యను చంపాలని ప్లాన్ చేశాడు.

అమిత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తుల్లో ఒకరైన విపిన్ సేథీని సంప్రదించాడు. తన భార్యను చంపాలని బదులుగా  రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. విపిన్ సేథీ రూ.2.40 లక్షలు అడ్వాన్స్‌గా స్వీకరించి, అతని సహాయకుడు హిమాన్షుతో కలిసి గుప్తా భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

విపిన్, హిమాన్షు ఇద్దరూ మహిళను కత్తితో పొడిచి చంపారు. ఆ తరువాత అది దొంగలపని అనుకునేలాఉండలని.. ఇంటిని దోచుకున్నారు. మహిళ, అమిత్ మొబైల్ ఫోన్‌లు తీసుకుని అక్కడి నుండి పారిపోయారు. ఎస్ కె గుప్తా, అతని కుమారుడు సహా నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. నేరాలకు ఉపయోగించిన ఫోన్లు, రక్తంతో తడిసిన దుస్తులు, స్కూటీలను పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. తదుపరి విచారణ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌