సీఎం కుమార్తెకు చెల్లింపులపై వ్యవహారం.. ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదు..!!

Published : Aug 10, 2023, 01:12 PM IST
సీఎం కుమార్తెకు చెల్లింపులపై వ్యవహారం.. ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదు..!!

సారాంశం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు రూ. 1.72 కోట్లు ముడుపులు అందినట్లు ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు బుధవారం అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వంపై దాడికి దిగుతాయని ఊహించారు. కానీ  అలా జరగలేదు.

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు రూ. 1.72 కోట్లు ముడుపులు అందినట్లు ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు బుధవారం అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వంపై దాడికి దిగుతాయని ఊహించారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఇసుక మైనింగ్ కంపెనీ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎమ్‌ఆర్‌ఎల్) నుంచి వీణా విజయన్‌ గత మూడేళ్లలో నెలవారీ వాయిదాల్లో రూ.1.72 కోట్లు అందుకున్నారు. అయితే నిధులు పొందిన వ్యక్తుల జాబితాలో వారి సొంత నాయకుల పేర్లు రావడంతో యూడీఎఫ్ ఈ విషయంలో మౌనం వహించాలని నిర్ణయించుకుంది.ఈ విషయాన్ని మరింత ముందుకు నెట్టితే ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆందోళనతో యూడీఎఫ్ నేతలు వెనక్కి తగ్గారు.

ఇక, ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు 2019 జనవరి 25న సీఎంఆర్‌ఎల్ కార్యాలయంపై దాడి చేసింది. తనిఖీలో నెలవారీ చెల్లింపులు లేదా ప్రముఖులకు ఇచ్చిన కోటా వివరాలను కలిగి ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలాఉంటే, సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్తా ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. వివాదాస్పద ఒప్పందం గురించి తనకు తెలియదని ఏషియానెట్ న్యూస్‌తో అన్నారు. వీణా, ఆమె కంపెనీ ఎక్సాలాజిక్‌తో ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదని కూడా అతను చెప్పారు. 

అయితే వీణా నుంచి ఐటీ అండ్ మార్కెటింగ్ కన్సల్టింగ్ సేవల కోసం 2016 డిసెంబర్‌లో సీఎంఆర్ఎల్ ఒప్పందం చేసుకుంది.  2017 మార్చి వీణా సంస్థ ఎక్సలాజిక్‌తో సాఫ్ట్‌వేర్ సేవల కోసం కొత్త ఒప్పందం కుదిరింది. ఇవి ఎక్సాలాజిక్ రూ. 3 లక్షలు, వీణాకు రూ. 5 లక్షలు ప్రతి నెల చెల్లించేలా  ఉంది. 

ఇదిలాఉంటే, అనంతరం అఫిడవిట్ ద్వారా ప్రకటనను ఉపసంహరించుకునేందుకు కార్తా, కంపెనీ అధికారులు ప్రయత్నించారు. అయితే వీణా, ఎక్సాలాజిక్‌లకు అక్రమంగా డబ్బులు చెల్లించారనే వాదనపై ఆదాయపు పన్ను శాఖ గట్టిగా నిలదీసింది.
 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు