భారత్‌లో నివసించే వారంతా హిందువులే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

By Mahesh KFirst Published Nov 16, 2022, 5:50 AM IST
Highlights

భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఈ విషయాన్నే 1925 నుంచి నొక్కి చెబుతూ వస్తున్నదని తెలిపారు. కుల మతాలు, భాష, ఆహారపుటలవాట్లు ఏవైనా అంతా హిందువులే అని వివరించారు.
 

న్యూఢిల్లీ: భారత్‌లో నివసించే వారంతా హిందువులే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆది నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నదని అన్నారు. చత్తీస్‌గడ్‌లో సుర్గుజా జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. భారత్‌ను మాతృభూమిగా భావించేవారు, ఇక్కడి బహుళత్వంలో ఇమిడిపోయి ఈ సంస్కృతిని గౌరవించే వారు అందరూ హిందువులే అని వివరించారు.

కుల మతాలు ఏవైనా, భాష, ఆహారపుటలవాట్లు వేరైనా, సిద్ధాంతాల్లోనూ వ్యత్యాసం ఉన్నప్పటికీ వారంతా హిందువులే అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ 1925 నుంచి ఈ విషయాన్నే చెబుతూ వస్తున్నదని వివరించారు. అదే సందర్భంలో ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ప్రజల మధ్య ఐక్యతను ఈ సిద్ధాంతం పెంపొందిస్తుందని అన్నారు. 

Also Read: భారత్ లోని 99 శాతం ముస్లింల పూర్వీకులు హిందుస్థానీలే - ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్

40 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించిన ప్రజల డీఎన్ఏ ఒక్కటే అని వివరించారు. అందరూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని పూర్వీకులు నేర్పించారని చెప్పారు. అదే విధంగా ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. సొంత లక్ష్యాలను సాధించుకోవడానికి ఇతరుల సంపద దోచుకోవద్దని వివరించారు. ఏది ఏమైనా.. సమస్యలు వచ్చినప్పుడు అంతా ఏకమవుతారని, అదే మన సంస్కృతి గొప్పదనమని తెలిపారు.

click me!