మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎవరు?: ఈ ఆరుగురికే ఛాన్స్

By narsimha lode  |  First Published Nov 26, 2019, 1:48 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎవరిని గవర్నర్ నియమిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆరుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 


ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ప్రొటెం స్పీకర్ గా ఎవరిని నియమిస్తారు గవర్నర్ అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొటెం స్పీకర్ చేతుల్లోనే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భవితవ్యం ఆధారపడి ఉంది.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీలో తన బలాన్ని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపుగా నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడ  ప్రొటెం స్పీకర్ చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది.

Latest Videos

undefined

ప్రస్తుత అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించనున్నారు గవర్నర్.  సీనియారిటీ ప్రకారం చూస్తే  మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌ రేసులో బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు కాళిదాస్ కోలంబ్కర్, రాధాకృష్ణ విఖే పాటిల్, బాబన్‌రావ్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, కేసీ పడవి, ఎన్సీపీ నుంచి దిలీప్ వాల్సే పాటిల్ ముందు వరుసలో ఉన్నారు. ఈ ఆరుగురి పేర్లను ఇప్పటికే గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. 

ప్రస్తుత  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేగా బాలాసాహెబ్ థోరట్ రికార్డు సృష్టించారు. ఎనిమిది దఫాలు  ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. సంగమనేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆయన విజయం సాధించారు.

ఇక బాలాసాహెబ్ థోరట్ తర్వాత ఏడు దపాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాలో కూడ పలువురు ఉన్నారు. ఈ జాబితాలో  డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ముందు వరుసలో నిలుస్తారు.

అజిత్ పవార్, జయంత్ పాటిల్,దిలీప్ వాల్సే పాటిల్ లు ఎన్సీపీ నుండి విజయం సాధిస్తున్నారు. వీరంతా ఎన్సీపీకి చెందినవారు. అయితే అజిత్ పవార్ ప్రస్తుతం శరద్ పవార్ తో విభేదించి బీజేపీతో చేతులు కలిపాడు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు.

Also read:ఫడ్నవీస్ రేపే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి: సుప్రీంకోర్టు

ఇక బీజేపీకి చెందిన బాబురావు పచ్చపూటే , కాళిదాస్ కోలంబర్ లు ఏడు దఫాలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి కేసీ పృథ్వీ కూడ ఏడు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

దిలీప్ వాల్సే పాటిల్ 12వ అసెంబ్లీకి, బాగ్డే 13వ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. అజిత్ పవార్ ను ఎన్సీపీ శాసనసభపక్ష నేతగా శరద్ పవార్ నియమించారు.

13వ అసెంబ్లీలో తొమ్మిది దఫాలు విజయం సాధించిన (ఆ సమయంలో) 9 దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన   గణపతిరావు దేశ్‌ముఖ్ ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని ఆ సమయంలో వర్కర్స్ పార్టీ తిరస్కరించింది. ఆరోగ్య కారణాలను చూపుతూ  వర్కర్స్ పార్టీ  గణపతిరావు దేశ్‌ముఖ్‌ను  ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని పార్టీ తిరస్కరించింది.

ఈ దఫా గణపతిరావు దేశ్‌ముఖ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుత అసెంబ్లీలో థొరట్ మాత్రమే అత్యధశిక దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు ఉంది.అయితే గవర్నర్  కాంగ్రెస్ కు చెందిన థొరట్‌ను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారా లేదా అనేది ప్రస్తుతం  ఆసక్తిగా మారింది.

  
 

click me!