ఫడ్నవీస్ రేపే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి: సుప్రీంకోర్టు

By narsimha lode  |  First Published Nov 26, 2019, 10:44 AM IST

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఈ నెల 27న బలాన్ని నిరూపించుకోవాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు తీర్పు చెప్పింది.


మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ఈ నెల 27న బలాన్ని నిరూపించుకోవాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు తీర్పు చెప్పింది.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై ఈ నెల 24 వ తేదీ నుండి సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.

Latest Videos

undefined

ఈ నెల 25 వ తేదీన ఇరు వర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 24వ తేదీన  మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బుధవారం సాయంత్రం లోపుగా నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read:గవర్నర్ సాబ్.. చూస్తున్నారా, మా బలం ఇది: కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల బలప్రదర్శన

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా  వెంటనే నియమించాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని  కూడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రహస్య ఓటింగ్ జరపకూడదని  కూడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదు గంలల లోపుగా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది. బల పరీక్ష కంటే ముందే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫడ్నవీస్ తన బలపరీక్షను ప్రొటెం స్పీకర్‌ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీఎం ఫడ్నవీస్  భవితవ్యం ఈ నెల 27వ తేదీన తేలనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారనే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా నియమిస్తారు.ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు.

ప్రొటెం స్పీకర్ పర్యవేక్షణలోనే బల పరీక్షను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రోటెం స్పీకర్ చేతిలోనే ఫడ్నవీస్ భవితవ్యం ఉంది. బల పరీక్షకు 24 గంటల సమయం ఇచ్చింది. 

ప్రొటెం స్పీకర్ నియామకం కోసం సుమారు ఐదు లేదా ఆరుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్ భవన్ కు పంపనుంది. అయితే ఆయా ఎమ్మెల్యేల గురించి సమాచారం ఇవ్వనున్నారు. ప్రొటెం స్పీకర్ గా ఎవరిని నియమించాలనేది గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకోనున్నారు.


ఎన్సీపీ శాసనసభపక్ష నేతగా అజిత్ పవార్ తానేనని ఆయన చెబుతున్నారు. అయితే ఎన్సీపీ శాసనసభపక్షనేతగా జయంత్ పాటిల్ ను నియమించినట్టుగా శరద్ పవార్ ప్రకటించారు.

అయితే ఫడ్నవీస్ బల పరీక్షలో ఎన్సీపీ విప్ జారీ చేయనుంది. అయితే ఎన్సీపీ శాసనససభపక్ష నేతలుగా చెప్పుకొంటున్నారు. అయితే ప్రొటెం స్పీకర్ ‌గా ఉన్న వ్యక్తి ఎన్సీపీ శాసనసభపక్ష నేతగా ఎవరిని గుర్తిస్తారనేది  ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఒకవేళ అజిత్ పవార్ ను ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా గుర్తిస్తే ఆయన జారీ చేసే విప్‌ను ఉల్లంఘించి ఓటు చేసే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే హక్కు ఉంటుంది. మరో వైపు జయంత్ పాటిల్‌ను ఎన్సీపీ శాసనసభపక్ష నేతగా గుర్తిస్తే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
 

click me!