శబరిమల ఆలయంలోకి మహిళ... కారం స్ప్రే చేసిన నిరసనకారులు

Published : Nov 26, 2019, 11:55 AM IST
శబరిమల ఆలయంలోకి మహిళ... కారం స్ప్రే చేసిన నిరసనకారులు

సారాంశం

మంగళవారం ఉదయం పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు తృప్తి దేశాయ్, బిందు తదితులు ఆలయ ప్రవేశం చేయడానికి శబరిమల బయలుదేరి వెళ్లారు. కాగా... వారిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు.


శబరిమలలో మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. శబరిమల ఆయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించారు. కాగా... ఆ మహిళలను పలువురు హిందుత్వ వాదులు, అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మంగళవారం ఉదయం పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు తృప్తి దేశాయ్, బిందు తదితులు ఆలయ ప్రవేశం చేయడానికి శబరిమల బయలుదేరి వెళ్లారు. కాగా... వారిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఆలయానికి వెళ్లేదారిలోనే వారిని నిరసనకారులు అడ్డుకున్నారు. బిందు ముఖంపై ఓ నిరసనకారుడు కారంతో స్ప్రే చేశాడు. శబరిమల నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. 

కాగా... పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారుల నుంచి రక్షించి బిందు, తృప్తిదేశాయ్ లను పోలీసులు సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు.  కాగా.... ఈ ఘటనపై తృప్తి దేశాయ్ మీడియాతో మాట్లాడారు.  తాను శబరిమలలోకి తప్పకుండా వెళ్తానని ఆమె చెబుతున్నారు. శబరిమలను దక్కించుకోవడం తమ హక్కు అని.. మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీం కోర్టు తమకు చెప్పిందని ఆమె తెలిపారు. శబరిమలలోకి వెళ్లకుండా తమను ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పడం గమనార్హం. కాగా... బిందుపై కారం స్ప్రే చల్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇదిలా ఉండగా.. బిందు గతంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే మహిళతో కలిసి స్వామివారికి దర్శించుకుంది. ఆ తర్వాత కనకదుర్గపై ఆమె కుటుంబసభ్యులే  దాడి చేయడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్