WHO website: జమ్మూ కాశ్మీర్‌ను.. పాక్, చైనాలో చూపిస్తున్న‌ WHO website

Published : Jan 31, 2022, 05:09 PM IST
WHO website: జమ్మూ కాశ్మీర్‌ను.. పాక్, చైనాలో చూపిస్తున్న‌ WHO website

సారాంశం

WHO website: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారిక వెబ్‌సైట్‌లో జమ్మూ కాశ్మీర్‌ను చైనా,పాకిస్తాన్‌లలో భాగంగా చూపుతున్న అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ .    

WHO website:  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క‌ కోవిడ్ అధికారిక వెబ్‌సైట్‌లో జమ్మూ కాశ్మీర్‌ను చైనా, పాకిస్తాన్‌లలో భాగంగా చూపబడింది. ఈ విష‌యాన్ని.. తీవ్రంగా ఖండిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ త‌ప్పిదంపై స్పందించాల‌ని కేంద్ర‌ ప్రభుత్వాన్ని కోరారు.

తాను https://covid19.who.intని సందర్శించినప్పుడు.. భారతదేశ ప‌టంలో జమ్మూ & కాశ్మీర్‌కు ప్రత్యేక రంగుతో క‌నిపించింద‌నీ, క్షుణంగా జూమ్ చేసి చూస్తే.. అవి పాకిస్తాన్, చైనా భూభాగాల్లో క‌నిపిస్తున్నాయ‌ని తెలిపారు.అలాగే జమ్మూ & కాశ్మీర్‌పై  క్లిక్ చేస్తే.. ఆ డేటా పాకిస్తాన్ &  చైనా లో క‌నిపిస్తున్నది లేఖ‌లో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగాన్ని వేర్వేరుగా గుర్తించారని ప్రధాని మోదీకి రాసిన లేఖలో తృణ్ మూల్ కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ఈ విష‌యం చాలా విస్మయానికి గురిచేసిందన్నారు ఎంపీ శంతాను సేన్. దీనిపై వెంటనే స్పందించాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం దీనిని పరిశీలించి, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ దుశ్చ‌ర్యపై ప్ర‌భుత్వం మ‌రింత‌ అప్రమత్తంగా ఉండాలనీ,  ఇంత కాలం ఇంత పెద్ద తప్పును ఎలా పట్టించుకోలేదని, భారత ప్రజలకు ప్రభుత్వం తెలియజేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సున్నిత‌మైన 
విషయాలను ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తూ ఉండాల‌ని  సూచించారు. 
గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్ముకశ్మీర్, లడాక్ ప్రాంతాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకన్నా భిన్నమైన రంగుల్లో చూపించార‌ని తెలిపారు. ట్విట్టర్ కూడా లేహ్ ప్రాంతాన్ని జీయో ట్యాగింగ్ లో రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా చూపించిందన్నారు. 

కాగా, 2021లో జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా, లద్ధాక్‌ ప్రాంతంలోని భారత భూభాగాన్ని చైనాగా చిత్రీకరిస్తూ ట్విట్టర్ భారతదేశ మ్యాప్‌ను తప్పుగా సూచించింది. దాంతో అప్పట్లో ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తీవ్రంగా పరిగణించి ఐటీ సెక్రటరీ అజయ్ సావ్నే ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకు లేఖ రాసిన విషయం తెలిసిందే.


గత సంవత్సరం.. ఈవిష‌యంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌కు ప్ర‌భుత్వం లేఖ  రాసింది.  తప్పు మ్యాప్‌లపై భారత్ "తీవ్ర అసంతృప్తి" వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తూ ఉండడం సరియైనది కాదని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్, కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మన దేశ మ్యాప్‌ను మర్చిచూపడం కూడా చర్చనీయాంశమైంది. 

సక్రమమైన భారతదేశ చిత్రపటాన్ని డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో పెట్టాలని, తప్పులను సరిదిద్దాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు గత ఏడాది డిసెంబర్ 30, ఈ ఏడాది జనవరి 3, 8 తేదీల్లో భారత ప్రభుత్వం లేఖలు రాసింది. అంతేకాదు ఐక్యరాజ్యసమతి శాశ్వత భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే, టెడ్రోస్ అధనామ్ వద్ద ప్రస్తావించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం