జార్జ్ సోరోస్ ఎవరు? ప్రధాని మోడీ గురించి ఏమన్నాడు? ఈ వివాదానికి సంబంధించి టాప్ పాయింట్స్ ఇవే

Published : Feb 17, 2023, 03:54 PM IST
జార్జ్ సోరోస్ ఎవరు? ప్రధాని మోడీ గురించి ఏమన్నాడు? ఈ వివాదానికి సంబంధించి టాప్ పాయింట్స్ ఇవే

సారాంశం

బిలియనీర్ జార్జ్ సోరోస్ భారత్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. అలాగే, అదానీ గురించి వచ్చిన ఆరోపణలు పేర్కొంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకీ జార్జ్ సోరోస్ ఎవరు? ప్రధాని మోడీ గురించి ఏమన్నారు? ఈ విషయాలను పరిశీలిద్దాం.  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం, గౌతమ్ అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయని హిండెన్‌బర్గ్ ప్రచురించిన రిపోర్ట్ ఆధారంగా బిలియనీర్ ఫిలాంథ్రోపిస్ట్ జార్జ్ సోరోస్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. హద్దు మీరి భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. జార్జ్ సోరోస్‌ను ఓ దేశం ఆర్థిక యుద్ధ నేరస్తుడిగా ప్రకటించిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జార్జ్ సోరోస్ ఎవరు? ఆయన ప్రధాని మోడీపై ఏ వ్యాఖ్యలు చేశాడో చూద్దాం.

92 ఏళ్ల జార్జ్ సోరోస్ ప్రపంచంలోనే సంపన్నుల్లో ఒకడు. ఉన్నత యూధు కుటుంబంలో జన్మించాడు. నాజీలు వచ్చేలోపు సోరోస్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆ కుటుంబం హంగరీని విడిచిపెట్టింది. 1947లో లండన్‌కు వచ్చారు. అక్కడే సోరోస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫిలాసఫీ చదివాడు. చదువుల తర్వాత లండన్ మెర్చంట్ బ్యాంక్ సింగర్ ఫ్రిడ్‌ల్యాండర్ బ్యాంకులో చేరాడు. 1956లో న్యూయార్క్‌కు వెళ్లాడు. అక్కడ యూరోపియన్ సెక్యూరిటీస్‌కు అనలిస్టుగా తొలుత చేశాడు.

1973లో ఓ హెడ్జ్ ఫండ్ పెట్టిన తర్వాత ఆర్థిక ప్రపంచంలో సోరోస్ తన ముద్ర వేశాడు. 1969 నుంచి 2011 దాకా క్లయింట్ మనీని మేనేజ్ చేశాడు. సోరోస్ బ్రిటీష్ పౌండ్‌ను షార్ట్ చేశాడు. తద్వార 1 బిలియన్ డాలర్లను సొమ్ము చేసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను బ్రేక్ చేసిన వ్యక్తిగా అపకీర్తి మూటగట్టుకున్నాడు. 

సోరోస్ నెట్‌వర్త్ 8.5 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. కోల్డ్ వార్ తర్వాత వీటిని చెకోస్లేవియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియాలోనూ స్థాపించాడు. ఈ శతాబ్ది ఆరంభంలో 70కి పైగా దేశాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. అతను పొలిటికల్‌గానూ యాక్టివ్‌గా ఉన్నాడు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్‌లకు మద్దతునిచ్చాడు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యిప్ ఎర్డోగన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడాడు.

Also Read: ఇది భారత్ పై దాడి: బిలియనీర్ జార్జ్ సోరోస్ కామెంట్లను ఖండించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. పూర్తి వివరాలివే

మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ముందు ఓ ప్రసంగంలో సోరోస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. అదానీ గ్రూప్ సంక్షోభం గురించి, ప్రధాని మోడీ గురించి వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ సన్నిహితులను పేర్కొన్నారు. విదేశీ మదుపరులకు,పార్లమెంటులో ప్రధాని మోడీ ఈ అవినీతి ఆరోపణలు, స్టాక్ మ్యానిపులేషన్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందే అని అన్నారు. అదానీ అవినీతి ఆరోపణలు దేశ ప్రభుత్వంపై మోడీ పట్టును నీరుగారుస్తుందని తెలిపారు. అంతేకాదు, భారత్‌లో ప్రజాస్వామిక పునరుజ్జీవనానికి ఇది బీజం వేయొచ్చని చెప్పారు. 

జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారత దేశంపై దాడిగానే పరిగణించాలని అన్నారు. భారత ప్రజాస్వామిక ప్రక్రియలను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తులను ప్రతి భారతీయుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు.

జార్జ్ సోరోస్ తన వ్యాఖ్యలతో భారత ప్రజాస్వామిక ప్రక్రియను ధ్వంసం చేయడానికి డిక్లరేషన్ ఇచ్చాడని స్మృతి ఇరానీ తెలిపారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఇలాంటి ఎన్నో విదేశీ శక్తులను భారతీయులు ఓడించారని, ఇక పైనా ఓడిస్తారని అన్నారు. జార్జ్ సోరోస్‌కు ప్రతి భారతీయుడు గట్టి బదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను బద్దలు కొట్టిన సోరోస్‌ను ఆ దేశం ఆర్థిక యుద్ధ నేరస్తుడిగా గుర్తించిందని, ఇప్పుడు అతను భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని అవాకులు చెవాకులు పేలుతు న్నాడని మండిపడ్డారు. జార్జ్ సోరోస్‌కు అనుగుణంగా నడుచుకున్న  ఏ రాజకీయ సంస్థ అయినా సరే భారత ఎన్నికల వ్యవస్థ ముందు దాని అసలు రూపాన్ని బయటపెట్టుకున్నట్టే అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం