కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కోర్టు: ధర్నాకు ఎవరు అనుమతిచ్చారు?

First Published Jun 18, 2018, 12:26 PM IST
Highlights

కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్


న్యూఢిల్లీ: న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడంపై హైకోర్టు మండిపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నాకు ఎవరు అనుమతిచ్చారని కోర్టు ప్రశ్నించింది.

ఐఎఎస్ అధికారులు సమ్మె చేయడాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సుమారు 8 రోజులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేంద్రజూన్ అభివృద్ది శాఖ మంత్రి గోపాల్ రాయ్  లు  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 

కేజ్రీవాల్ ఆందోళనపై  బిజెపి నేతలు ఢిల్లీ హైకోర్టును  ఆశ్రయించారు. ఈ విషయమై సోమవారం నాడు విచారణ చేసిన హైకోర్టు  ఢీల్లీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇతరుల కార్యాయాలు లేదా ఇళ్ళలోకి వెళ్ళి ధర్నా చేయడం సరైందికాదని కోర్టు అభిప్రాయపడింది. 

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్, సీపీఎం కార్యకర్తలు ఆదివారం నాడు  ఆప్ కార్యాలయం నుండి ప్రధానమంత్రి మోడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

click me!