సావర్కర్ బుల్‌బుల్ పక్షి రెక్కలపై కూర్చుని జైలు బయటకు వెళ్లి వచ్చేవాడు: కర్ణాటక 8వ తరగతి పుస్తకంలో పాఠం!

Published : Aug 28, 2022, 07:57 PM IST
సావర్కర్ బుల్‌బుల్ పక్షి రెక్కలపై కూర్చుని జైలు బయటకు వెళ్లి వచ్చేవాడు: కర్ణాటక 8వ తరగతి పుస్తకంలో పాఠం!

సారాంశం

కర్ణాటకలో ఎనిమిదో తరగతి క్లాస్ బుక్‌లో వీడీ సావర్కర్ పై ఓ పాఠం చేర్చారు. అందులో ఆయన అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా బుల్‌బుల్ పక్షి రెక్కలపై బయటకు వచ్చేవాడని, ప్రతి రోజూ మాతృభూమిని విజిట్ చేసేవాడని ఆ పాఠం వివరిస్తున్నది.  

న్యూఢిల్లీ: కర్ణాటకలో మరో వివాదం ముదురుతున్నది. బీజేపీ ప్రభుత్వం చరిత్రను మార్చి రాసే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టెక్స్ట్‌ బుక్ రివిజన్ కమిటీ హైస్కూల్ కర్రికులంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పై ఓ పాఠాన్ని చేర్చినట్టు తెలుస్తున్నది.

8వ తరగతి కన్నడ టెక్స్ట్ బుక్‌లో వీడీ సావర్కర్ పై ఓ చిన్న లెస్సన్ ఉన్నది. ఈ పాఠంలో ఓ అభూత కల్పన వంటి విషయాన్ని చొప్పించడం వివాదానికి కేంద్రబిందువుగా మారుతున్నది. సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఓ పక్షి రెక్కలపై రోజూ మాతృభూమిని చూసి వచ్చేవాడని ఆ పాఠం చెబుతున్నది.

ఆ పాఠంలోని ఒక పేరాగ్రాఫ్ ఇలా ఉన్నది. ‘సావర్కర్‌ను నిర్బంధించిన సెల్‌లో ఓ చిన్న హోల్ (బిలం) కూడా లేదు. కానీ, బుల్‌బుల్ పక్షి ఆయన గదిని విజిట్ చేస్తుండేది. సావర్కర్ ఆ పక్షి రెక్కలపై కూర్చుని జైలు నుంచి బయటకు వచ్చేవాడు. ఆ బుల్‌బుల్ పక్షి రెక్కలపై కూర్చుని మాతృభూమిలో రోజు పర్యటిస్తుండేవాడు’ అని ఉన్నది.

వీడీ సావర్కర్ అంశం తరచూ బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య వాగ్యుద్ధానికి కారణంగా ఉంటున్నది. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్రకు సంబంధించి ఈ వాదాలు మరింత తీవ్రంగా ఉంటుంటాయి.

కర్ణాటకలో సావర్కర్ పై చర్చ ఎక్కువగా జరుగుతున్నది. కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల చేసిన హర్ ఘర్ తిరంగా ప్రకటనలోనూ ఆయన ఫొటో ఉన్నది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను మాత్రం తొలగించడం గమనార్హం. అలాగే, మంగళూరులో సున్నితమైన ప్రాంతంలోని సర్కిల్‌కు సావర్కర్ సర్కిల్ అని పేరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివమొగ్గలో అమీర్ అహ్మెద్ అనే సర్కిల్ దగ్గర పంద్రాగస్టున సావర్క్ పోస్టర్ పెట్టారు. 

ఈ పోస్టర్‌ను ముస్లిం యువకులు వ్యతిరేకించారు. ఆ పోస్టర్‌ను తొలగించాల్సిందిగా వారు నిరసన చేశారు. కాగా, హిందూ అనుకూల గ్రూపు సభ్యులు అందుకు వ్యతిరేకంగా నిరసన చేశారు. సావర్కర్ ఫ్లెక్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు.ఈ పోస్టర్ కేంద్రంగా అక్కడ ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ ఏరియాలో నిషేధాజ్ఞలు విధించారు. శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

కాగా, సీఎం బసవరాజు బొమ్మై పూర్తిగా ఆర్ఎస్ఎస్ తొత్తుగా మారిపోయారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్నది. తన సీఎం పీఠం కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉన్నాడని ఆరోపించింది. ఆర్ఎస్ఎస్ పెద్దల మెప్పు కోసమే ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు మండిపడింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం