చాలా ప్రైవేటు సంస్థలు కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆఫీసులకు పిలిపించుకోవాలని భావించినా.. ఒమిక్రాన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను మరో ఏడాది పాటు కొనసాగించనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం న్యూ వర్క్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ వేగంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. యూకేలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతీ రోజు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో కూడా డెల్టా కేసులు ఇప్పటికీ మూడు వందల మార్క్‌ను దాటాయి. డిసెంబర్ 2వ తేదీన ఇండియాలో మొదటిసారిగా రెండు కేసులను గుర్తించారు. ఈ 22 రోజుల్లో ఈ సంఖ్య మూడు వందలను దాటింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన సూచించారు. అయితే ఉద్యోగుల విషయంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
ఇప్పటి వరకు దాదాపు అవకాశం ఉన్న అన్ని ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా తగ్గిపోతుందన్న కారణంతో వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగులను ఆఫీసులకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాయి. కానీ మళ్లీ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని భావిస్తున్నాయి. అయితే ఇండియాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇలా చేస్తే ఒమిక్రాన్ కేసులు పెరకుండా నివారించవచ్చని ఆలోచిస్తోంది. దీని కోసం న్యూ వర్క్ మోడల్‌ను తయారు చేసే పనిలో ఉంది.
undefined
18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
ఈ న్యూ వర్క్ మోడల్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ మోడల్‌లో ఎక్కువగా వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చి, ప్రత్యేకంగా కేటాయించిన కొన్ని రోజుల్లో మాత్రమే ఆఫీసుకు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో పాటు పని గంటలు ఎన్ని ఉండాలి ? ఇందులో ఉద్యోగికి, సంస్థలకు ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుంటోంది. అలాగే ఉద్యోగి ఇంటర్నెట్ బిల్, కరెంటు బిల్లులను కూడా ఆయా సంస్థలే భరించే విధంగా ఈ కొత్త వర్క్ మోడల్ తయారుకానుంది. అయితే ఇలాంటి వర్క్ మోడల్స్‌ను ఇప్పటికే పలు దేశాలు అమలు చేసేందుకు రెడీ అయిపోయాయి. వాటిని చట్టంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆయా దేశాలు ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చిన తరువాతే ఇండియాలో ఈ న్యూ వర్క్ మోడల్ ను అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇలాంటి కొత్త పని విధానాన్ని పోర్చ్‌గల్ ఇప్పటికే చట్టం రూపంలో తీసుకొచ్చింది. అక్కడ ఈ విధానం ప్రస్తుతం అమలవుతోంది. ఆయా దేశాల్లో ఈ కొత్త విధానం ద్వారా ఎదురైన సమస్యలు, లాభాలు, నష్టాలు అన్నీ బేరీజు వేసుకుని మార్పులు, చేర్పులతో ఈ విధానం అమలు చేసే అవకాశం ఉంది.
గుజరాత్: వడోదరాలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు.. నలుగురి మృతి