Coronavirus: 18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా

By Mahesh Rajamoni  |  First Published Dec 24, 2021, 3:24 PM IST

Coronavirus: క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. భార‌త్ లో ఈ ర‌కం కేసులు 300ను దాటేశాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికం చిన్నారులు, 18 ఏండ్ల లోపు వారు ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 
 


Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. మొద‌ట ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన ద‌క్షిణాఫ్రికా సహా అమెరికా, అలాగే బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి ప‌లు యూర‌ప్ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ ఈ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 300 ల‌కు పైగా న‌మోద‌య్యాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీ, మ‌హారాష్ట్రల‌తో పాటు తెలంగాణ‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌మిళ‌నాడులో కొత్త‌గా వెలుగుచూసిన ఓ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. ఒకే ర‌జు 31 న‌మోదుకావ‌డం.. వైర‌స్ వ్యాప్తికి అద్దం ప‌డుతోంది. అయితే, ప్ర‌స్తుతం న‌మోదైన కేసుల‌ను గమ‌నిస్తే క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పిల్ల‌లు, 18 సంవ‌త్స‌రాల లోపువారిపై అధిక ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని తెలుస్తున్న‌ది. ఇదివ‌ర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం పిల్ల‌ల‌పై క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్ర‌భావం అధికంగా ఉండే అవ‌కాశ‌లున్నాయ‌ని అంచ‌నా వేసింది. దీనిని అనుగుణంగానే ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  పిల్లలు, 18 సంవత్సరాల లోపు యుక్త వయస్కులకు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సోకుతుందంటూ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఇదివరకే హెచ్చరించారు.

Also Read: ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.. యూపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?.. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Latest Videos

undefined

ఒమిక్రాన్ వెలుగుచూసిన చాలా దేశాల్లో కూడా ఇదే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. మ‌న దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ‌గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ప్రత్యేకించి- మూడు రాష్ట్రాల్లో పిల్లల్లో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాట‌క‌ల్లో  పిల్లలు దీని బారిన పడ్డారు. మొత్తంగా తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక  మహారాష్ట్రలో కొత్తగా 23 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో నలుగురు 18 సంవత్సరాల్లోపు  వారు ఉన్నారు.  గుజరాత్‌లో ఏడు కొత్త ఒమిక్రాన్ కేసుల్లో మూడు, క‌ర్నాట‌క‌లో  13కు రెండు ఒమిక్రాన్ కేసులు 18 సంవ‌త్స‌రాల లోపు వారు ఉన్నారు.   అలాగే, క‌ర్నాట‌క‌లో గ‌త 24 గంటల వ్యవధిలో కొత్తగా 13 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, అందులో  తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు ఉన్నారు.  వీరు విదేశాల నుంచి వ‌చ్చిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. అన్ని కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించినప్పటికీ.. వైరస్ సోకిందని చెబుతున్నారు. అయితే, కొత్త‌గా న‌మోద‌వుతున్న‌కేసుల‌క‌లో 18 సంవ‌త్స‌రాల లోపువారు అధికంగా ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే ఈ వ‌య‌స్సు గ్రూప్ లోని వారికి క‌రోనా టీకాలు ఇంకా మ‌న దేశంలో అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వేరియంట్ పంజా విసిరే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: రూ.3 వేల కోసం బండ‌రాళ్ల‌తో కొట్టిచంపారు.. దేశ‌రాజ‌ధానిలో దారుణ ఘటన 

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వైర‌స్ కొత్త కేసుల‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించాయి. క్రిస్ట‌మ‌స్, కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి అధికం అయ్యే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు  నిపుణులు అంచనా వేశారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఆయా వేడుక‌ల విష‌యంలో నిషేధం విధించ‌డం, స్థానిక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం.. కొత్త‌గా కోవిడ్‌-19 మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచనలు చేశారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో  సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని సూచించింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు ఉన్నందున ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆందులో పేర్కొంది. కేసుల పెరిగినా అందుల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌ళ్లీ భార‌త్ లో లాక్ డౌన్ విధించినున్నారా? అంటూ లాక్‌డౌన్ రోజుల‌ను గుర్తుచేసుకుంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ విజృంభ‌ణ‌.. ప‌లు రాష్ట్రాల్లో ఆంక్ష‌లు.. మ‌ళ్లీ లాక్‌డౌన్ తప్ప‌దా?

click me!