
గుజరాత్‌లోని (gujarat) వడోదరా (vadodara) కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) బాయిలర్లు (boiler blast) పేలాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా వుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.