ఇంకెప్పుడు రిటైర్డ్ అవుతారు, మీకిప్పుడే 83 ఏళ్లు, నాకు రాష్ట్రాన్ని నడిపే సత్తా లేదా?-శరద్ పవార్ పై అజిత్ ఫైర్

Published : Jul 05, 2023, 04:23 PM IST
ఇంకెప్పుడు రిటైర్డ్ అవుతారు, మీకిప్పుడే 83 ఏళ్లు, నాకు రాష్ట్రాన్ని నడిపే సత్తా లేదా?-శరద్ పవార్ పై అజిత్ ఫైర్

సారాంశం

తనకు మహారాష్ట్రను నడిపే సత్తా లేదా అని ఎన్సీపీ తిరుగుబాటు నాయకుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే 83 ఏళ్లు వచ్చాయని, ఇంకా ఎప్పుడు రిటైర్డ్ అవుతారని ప్రశ్నించారు. 

తన సమీప బంధువు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆరోపించారు. తనకు మహారాష్ట్రను నడిపించే సత్తా లేదని ఆయన ఎందుకు భావించారని అన్నారు.

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన లాయర్.. (వీడియో)

‘‘మీ ఆశీస్సులు నాకు ఎందుకు లభించలేదు. మహారాష్ట్రను నడిపించే సత్తా నాకు లేదా...? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సులేను అంగీకరించాం’’ అని అజిత్ పవార్ అన్నారని సీఎన్ బీసీటీవీ18 పేర్కొంది. ‘‘ఇంకా మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు, మీకు ఇప్పటికే 83 వచ్చాయి.’’ అని అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శరద్ పవార్ ను ఆయన పశ్నించారు.

గతంలో ఎన్సీపీ జాతీయ పార్టీగా ఉండేదని అజిత్ పవార్ అన్నారు. కానీ నేడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు. కాగా.. బీజేపీ-శివసేన మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గం తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ముంబైలోని బాంద్రాలో నేడు సమావేశం నిర్వహించింది. అజిత్ పవార్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 35 మంది హాజరయ్యారు. అయితే అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అజిత్ పవార్ శిబిరానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని మహారాష్ట్ర శాసనసభ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంత్ కల్సే తెలిపారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. 

డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు - శరద్ పవార్ మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్.. కారణమేంటంటే ?

అంతకంటే ముందు ఆయన మద్దతుదారులు దక్షిణ ముంబైలోని దేవ్ గిరి అధికారిక నివాసం వెలుపల గుమిగూడారు. అయితే 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 40 మంది అజిత్ పవార్ వెంట ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ పాటిల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ఆదివారమే ఆయన గవర్నర్ సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం