Rahul Gandhi: చైనా ఆక్ర‌మించిన భారత్ ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు: రాహుల్ గాంధీ

By Rajesh KFirst Published Jan 28, 2022, 5:03 PM IST
Highlights

Rahul Gandhi : చైనా ఆక్ర‌మించిన భారత్ ను తిరిగి  ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్ర‌ధాని మోదీ ప్ర‌శ్నించారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌కుడ్ని చైనా తిరిగి భార‌త సైన్యానికి అప్ప‌గించిన సంద‌ర్భంగా  ప్ర‌ధాని మోడీ పై ప్రశ్న‌ల వ‌ర్షం కురిపించారు రాహుల్ గాంధీ..
 

Rahul Gandhi : చైనా విష‌యంలో కేంద్రంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ. చైనా ఆక్ర‌మించిన భార‌త్ ను ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారని ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించారు. చైనా ఆర్మీ అధీనంలో ఉన్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌కుడ్ని చైనా తిరిగి భార‌త సైన్యానికి అప్ప‌గించిన సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించారు.

గ‌త‌వారం రోజులుగా చైనా ఆర్మీ అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ తరోన్‌ను సరిహద్దు ప్రాంతమైన వాచా దమాయ్ పాయింట్ వద్ద భార‌త సైన్యానికి అప్ప‌గించింది చైనా ఆర్మీ. ఈ విష‌యంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విష‌యం చాలా ఊరట కలిగిస్తోందని అన్నారు. చైనా ఆక్రమించుకున్న భూమిని ఎప్పుడు తిరిగి తెస్తారు ప్ర‌ధాని మోదీజీ ? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
 
 ‘అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌కుడు మిరామ్ టోరాన్‌ను చైనా ఆర్మీ తిరిగి అప్ప‌గించింద‌ని వార్త‌లొచ్చాయి. మ‌రి చైనా ఆక్ర‌మించిన భార‌త భూమిని ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారు ప్ర‌ధాన‌మంత్రి గారూ?’ అంటూ రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ ఈనెల 23న చేసిన ట్వీట్‌ను తాజా ట్వీట్‌కు అనుసంధానం చేశారు. 

ఈ నెల 19న ఈ బాలుడ్ని చైనా సైన్యం అప‌హ‌రించింద‌ని బీజేపీ ఎంపీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి క‌నిపించకుండా పోయిన మిరామ్ టోరాన్‌ను చైనా సైన్యం తిరిగి భార‌త సైన్యానికి అప్ప‌గించింది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల్లో ఆ బాలుడ్ని అప్ప‌గించార‌ని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు ట్వీట్ చేశారు.  వెంట‌నే చైనా సైన్యాన్ని అడిగింది. కానీ, చైనా మాత్రం ఆ బాలుడు మా వ‌ద్ద లేదంటూ న‌మ్మ‌బ‌లికింది.  చివ‌రికి ఆ బాలుడు త‌మ వ‌ద్దే ఉన్నాడ‌ని చైనా అంగీక‌రించింది.


ఆ సందర్భల్లో మిరామ్ జాడ తెలియకపోవడంపై రాహుల్ ట్వీట్ చేస్తూ.. ''ప్రభుత్వం అనేది ఉంటే మీ బాధ్యత మీరు చేయాలి. మిరామ్ తరోన్‌ను వెనక్కి రప్పించండి'' అని అన్నారు. ఈనెల 18న అప్పర్ సియాంగ్ జిల్లా జిదో గ్రామానికి చెందిన మిరామ్ తప్పిపోయి చైనా భూభాగంలోకి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం పీఎల్ఏను భారత సైన్యం సంప్రదించడం, అతని ఆచూకీ చిక్కినట్టు పీఎల్ఏ ప్రకటించడం, భారత్ అభ్యర్థన మేరకు ఆ యువకుడిని సరిహద్దు ప్రాంతంలో గురవారంనాడు అప్పగించారు. 

click me!