లాడెన్‌ను మట్టుబెట్టినట్టు మేం చేయలేమా: అరుణ్ జైట్లీ

Published : Feb 27, 2019, 03:04 PM IST
లాడెన్‌ను మట్టుబెట్టినట్టు మేం చేయలేమా: అరుణ్ జైట్లీ

సారాంశం

 అమెరికా పాకిస్థాన్‌లో ఓసామా బిన్ లాడెన్‌ను ఏ రకంగా  మట్టుబట్టారో అదే విధంగా మేం చేయలేమా అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ  ప్రశ్నించారు.  

న్యూఢిల్లీ: అమెరికా పాకిస్థాన్‌లో ఓసామా బిన్ లాడెన్‌ను ఏ రకంగా  మట్టుబట్టారో అదే విధంగా మేం చేయలేమా అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ  ప్రశ్నించారు.

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏ దేశానికైనా  వారం రోజుల గడువు చాలా ఎక్కువని చెప్పారు.  లాడెన్ ను ఏ రకంగా అమెరికా నావికాదళం మట్టుబెట్టిందో తాము కూడ అదే పని చేయలేమా అని ఆయన ప్రశ్నించారు.

పీఓకేలోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ మంగళవారం నాడు కాల్పులకు దిగింది. మరో వైపు బుధవారం నాడు ఉదయం పాక్‌కు చెందిన జైట్ ఫైటర్లు భారత గగనతలంలోకి ప్రవేశించాయి.

ఈ పాక్ విమానాలను భారత వైమానిక దళం వెంటాడింది.దీంతో పాక్ జెట్ ఫైటర్లు వెను దిరిగినట్టుగా భారత్ ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే