యుద్ధ సన్నాహల్లో పాక్: 6 ఎయిర్‌పోర్టులను మూసివేసిన భారత్

By Siva KodatiFirst Published Feb 27, 2019, 1:55 PM IST
Highlights

పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 

పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ గుట్టు చప్పుడు కాకుండా తమ దళాలను, ఆయుథాలను, యుద్ధ ట్యాంకులను సరిహద్దులకు తరలిస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా భారత భూభాగాన్ని దాటి చొచ్చుకు వచ్చిన పాక్ యుద్ధ విమానాలు రాజౌరీ, నౌషెరా సెక్టార్లలో బాంబులు వేశాయి. అయితే దీనిని భారత వైమానిక దళం సమర్ధవంతంగా తిప్పికొట్టింది.

అంతేకాకుండా ఎఫ్-16 యుద్ధ విమానాలను వెంటాడిన ఎయిర్‌ఫోర్స్ నౌషెరా వద్ద దానిని కూల్చివేసింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉంది.

దీనిలో భాగంగా జమ్మూ, శ్రీనగర్, లేహ్, పఠాన్‌కోట్‌లలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ విమానాశ్రయాలను మూసివేసింది. పౌర విమానాల రాకపోకలను నిలిపివేసి సైన్యానికి అప్పగించింది. మరోవైపు అమృతసర్, చంఢీగడ్ విమానాశ్రయాలను కూడా ప్రభుత్వం మూసి వేసింది. 

click me!