అనుమానం.. భార్య ప్రైవేటు పార్ట్స్ పై కత్తితో వాతలు

Published : Feb 27, 2019, 02:32 PM IST
అనుమానం.. భార్య ప్రైవేటు పార్ట్స్ పై కత్తితో వాతలు

సారాంశం

భార్య తన ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో.. ఓ భర్త పైశాచికంగా ప్రవర్తించాడు.

భార్య తన ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో.. ఓ భర్త పైశాచికంగా ప్రవర్తించాడు. కత్తిని వేడి చేసి.. భార్య ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెట్టాడు.  ఈ దారుణ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్ కి చెందిన ఓ వ్యక్తి(45)కి వివాహమై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇటీవల భార్య.. ఎవరితో ఫోన్ లో మాట్లాడటం అతను గమనించాడు. దీంతో.. భార్య పరాయి పరుషుడితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానం అతనిలో మొదలైంది. ఆ అనుమానం నిజమో కాదో.. తేల్చుకోకుండా.. ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు.

బెల్టుతో దారుణంగా కొట్టాడు. క్షమాపణలు చెప్పాలంటూ ఆమెను హింసించాడు. తాను ఏ తప్పు చేయలేదని ఆమె ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా హింసించాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆమె కిందపడిపోగా.. వెంటనే కిచెన్ లోకి వెళ్లి కత్తిని వేడి చేసి.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెట్టాడు.

ఇలా రెండు మూడు సార్లు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెట్టాడు. గత శనివారం.. భర్త బంధువుల పెళ్లికి వెళ్లాడు. ఆ సమయాన్ని అదునుగా చేసుకొని ఆమె తన బంధువుల ఇంటికి చేరింది. భర్త చేసిన అరాచకాన్ని వాళ్లకి వరించింది. తన బంధు సహాయంతో ఆస్పత్రికి వెళ్లగా తీవ్రగాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. 

ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..