ఆ మాటకు వాజ్ పేయీ ఏడ్చేశారట..!

By ramya neerukondaFirst Published Aug 17, 2018, 1:58 PM IST
Highlights

వేరే ఎవరైనా అయితే.. ఆనందంతో గంతులు వేసేవారు. కానీ వాజ్ పేయీ మాత్రం కన్నీరు పెట్టుకున్నారు.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ.. గురువారం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన చనిపోయిన తర్వాత వాజ్ పేయీ గొప్పతనాన్ని వివరిస్తూ.. కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ఓ విషయాన్ని తెలియజేశారు. ఆయనకు ప్రజలంటే ఎంత ఇష్టమో తెలియజేసే సంఘటన ఇది.

ఎవరికైనా ప్రధాని పదవి అప్పగిస్తున్నాం అంటే.. ఎగిరి గంతేస్తారు. కానీ.. వాజ్ పేయీ మాత్రం కన్నీరు పెట్టుకున్నారు. ఆనందంతో అని పొరపాటు పడేరు. కానే కాదు.. ఆయన బాధతో కన్నీరు పెట్టుకున్నారు. 

ఎందుకంటే.. అటల్ బిహారీ వాజ్‌పేయి 1996లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు తాను ఆయనను ఇంటర్వ్యూ చేశానని రాజీవ్ శుక్లా చెప్పారు. ‘‘మీరు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపటి నుంచి మీరు భద్రతా వలయంలో ఉంటారు. ప్రజలను దూరం నుంచి మాత్రమే కలుసుకోవడం సాధ్యమవుతుంది’’ అని అంటూ ఉండగానే వాజ్‌పేయి ఏడవడం ప్రారంభించారని శుక్లా చెప్పారు.

అందరినీ కలుపుకుపోవడం మీదే వాజ్‌పేయి దృష్టి పెట్టేవారన్నారు. ప్రతిపక్షాలు కూడా ఆయనతో పని చేయడానికి ఇబ్బంది పడేవి కాదన్నారు

click me!